ఆంధ్రప్రదేశ్‌

డిస్కాంల బలోపేతంపై నేడు ఢిల్లీలో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: జాతీయ స్ధాయిలో వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కాంలను ఆర్ధికంగా బలోపేతం చేయడం, పనితీరును మెరుగుపరచడం అనే అంశంపై గురువారం ఢిల్లీలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి. భవానీ ప్రసాద్ ప్రారంభిస్తారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఫోరమ్ ఫర్ రెగ్యులేటర్స్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. విద్యుత్ నియంత్రణ మండళ్ల మధ్య సమన్వయం సాధించేందుకు, జాతీయ స్ధాయిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసే విషయమై ఈ సదస్సులో ప్రణాళికను ఖరారు చేస్తారని అజయ్ జైన్ చెప్పారు. కేంద్రం డిస్కాంలను బలోపేతం చేసేందుకు ఉదయ్ స్కీంను ఆవిష్కరించింది. ఉజ్వల్ డిస్కాం ఎష్యూరెన్స్ యోజన (ఉదయ్) స్కీం కింద డిస్కంలు ఆర్థికంగా పుంజుకునేందుకు ఉపయోగపడుతాయని ఆయన చెప్పారు. 2015 సెప్టెంబర్ వరకు రుణాలున్న డిస్కాంలను ఆదుకునేందుకు ఉదయ్ స్కీంను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద మొదటి ఏడాది 50 శాతం రుణాన్ని, రెండవ ఏడాది 25 శాతం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ స్కీం వల్ల డిస్కాంలు నష్టాల నుంచి తేరుకుంటాయని ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఏపిఇఆర్‌సి డిస్కాంలు నష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు బ్లూప్రింట్‌ను తయారు చేసిందన్నారు. ఈ ఏడాది ఏపి ప్రభుత్వం రూ.7360 కోట్లను, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.3680 కోట్లను రాష్ట్రం నష్టాలను భరించాల్సి ఉంటుందని అజయ్ జైన్ తెలిపారు.

సదస్సును ప్రారంభించనున్న
ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్