తెలంగాణ

ఉద్యోగులు @ 3252

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: కొత్త జిల్లాల నేపథ్యంలో 3252 పోస్టులు అవసరమని సర్కారు ప్రాథమికంగా లెక్క తేల్చింది. జిల్లాల పునర్విభజన కోసం అన్ని శాఖల్లో పోస్టులు పెరిగే అవకాశముంది. దీనికోసం అర్హతల మేరకు పదోన్నతులు కల్పించి, పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవిన్యూ, పోలీసు శాఖల్లో ఎక్కువ పోస్టులు అవసరమని అధికారుల నుంచి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. సిఎం ముఖ్య కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో వివిధ శాఖాధిపతులతో సమావేశమయ్యారు.
కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలకు ఎంతమంది ఉద్యోగులు అవసరం, ఏ క్యాడర్‌లో ఎన్ని పోస్టులు కావాలి, వాటిని ఏవిధంగా భర్తీ చేయాలి? అనే అంశాలపై వివిధ శాఖాధిపతులతో శాంతికుమారి చర్చించారు. వివిధ శాఖల నుంచి అందిన ప్రాథమిక నివేదిక ప్రకారం 3252 పోస్టులు అవసరమని లెక్క తేల్చారు. వీటిని ఏవిధంగా భర్తీ చేయాలి, పదోన్నతులు ఎలా కల్పించాలి తదితర అంశాలపై శాఖాధిపతులకు శాంతికుమారి మార్గనిర్దేశం చేశారు.
జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు రెవిన్యూ డివిజన్, మండల రెవిన్యూ అధికారి, మండలాభివృద్ది అధికారి, పోలీస్ స్టేషన్ తదితర కార్యాలయాల నిర్వాహణకు సత్వరం ఏర్పాట్లు చేయాలని శాంతికుమారి ఆదేశించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటైన రోజు నుంచే పరిపాలనా ఆరంభమయ్యేలా అధికార గణాన్ని సిద్ధం చేయాలని శాంతికుమారి ఆదేశించారు. కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్న అక్టోబర్ 11 (దసరా)నుంచే రెవిన్యూ, పోలీసు కార్యాలయాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని శాంతికుమారి ఆదేశించారు.