తెలంగాణ

వ్యవసాయ విద్యలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యలో తగిన మార్పులు అవసరమని భారత వ్యవసాయ పరిశోధనా మండలి, విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ ఎస్ రాథోర్ అన్నారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘం (ఐఎయుఏ) సంయుక్తంగా ‘యూత్ అండ్ స్మార్ట్ అగ్రికల్చర్ - సవాళ్లు, అవకాశాలు’ అన్న అంశంపై రెండు రోజులపాటు హైదరాబాద్ నిర్వహించిన మేధోమథన సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ జనాభాలో 57 శాతం మంది 30 ఏళ్లలోపు యువకులేనని, వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించాలంటే, ఈ రంగంలో ఉపాధి, వ్యాపార, వాణిజ్య అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవసాయ రంగం భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి నిపుణుల అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎంసి వార్ష్‌నీయ మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తులలో భారతదేశం ఆశించిన స్థాయి ప్రగతిని సాధించిందని, అయితే పంటకోత అనంతర నష్టాలు తగ్గింపు, శుద్ధి, ఎగుమతులపై దృష్టి నిలపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గుజరాత్‌లోని ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎన్‌సి పటేల్ మాట్లాడుతూ, దేశంలో అధిక శాతంగా ఉన్న యువత శక్తి సామర్థ్యాలను వ్యవసాయ రంగానికి సమర్థవంతంగా వినియోగించుకుంటే భారతదేశం ప్రపంచాన్ని ఏలుతుందని అన్నారు. యువతను వ్యవసాయంవైపు ఆకర్షించేందుకు పట్టణాలు,గ్రామాల మధ్య అంతరాలు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఏర్పాటైన తమ విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మేధోమథన సదస్సులో పలు అంశాలపై చర్చించనున్నారు. బుధవారం కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, భారత వ్యవసాయ మండలికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఇక్రిశాట్ శాస్తవ్రేత్తలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా
885 సెన్సర్లు ఏర్పాటు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం, వర్షాలను ముందుగా వాస్తవ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని కచ్చితంగా అంచనా వేసేందుకు 885 సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రియల్ టైం వాతావరణ డాటాను సేకరిస్తారు. వచ్చే జనవరి నుంచి ఈ వ్యవస్ధను ప్రారంభించనున్నట్లు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఐటి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో 885 సెన్సర్లను నెలకొల్పుతారు. దీనిని వెబ్ పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు.