హైదరాబాద్

అరుదైన శస్తచ్రికిత్స చేసిన అమెరికన్ ఆంకాలజీ వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 28: నగరానికి చెందిన అమెరికన్ ఆంకాలజీ వైద్యులు కడుపులో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళకు అరుదైన శస్తచ్రికిత్స నిర్వహించారు. బుధవారం పంజాగుట్టలోని ఎన్‌కేయం గ్రాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైద్యులు జూలూరి శ్రీనివాస్, నీలేష్ గుప్తా శస్తచ్రికిత్స వివరాలను వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన నాగలక్ష్మి (47) చాలాకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో క్యాన్సర్ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. ఇందుకోసం కీమోథెరఫీ నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రోగిని తమ ఆసుపత్రికి తీసుకురాగా పెరిటోనియెల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య విధానంలో సైటోరిడక్టివ్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఈ శస్తచ్రికిత్సను విజయవంతంగా పూర్తి చేసిట్టు తెలిపారు. కడుపులోని చిన్న, పెద్ద పేగుల్లో పూర్తిగా పేరుకుపోయిన క్యాన్సర్ కణాలను తొలగించి, మిగిలిన కణాలను నశించేందుకు కీమోథెరఫీని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ పవర్ జాదవ్, శ్రీనివాస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.