ఆంధ్రప్రదేశ్‌

నడి సంద్రంలో ఆగిపోయిన ప్రయాణికుల నౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 28: విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరిన ప్రయాణికుల నౌక ఎంవి హర్షవర్దనలో సాంకేతిక లోపం తలెత్తడంతో నడిసంద్రంలో నిలిచిపోయింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో విశాఖకు 14 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయిన ఈ నౌకకు మరమ్మతులు బుధవారం రాత్రికి కూడా కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. విశాఖకు తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉందని విశాఖపట్నం పోర్టు ట్రస్టు వర్గాలు భావిస్తున్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ నౌక అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్‌కు ప్రయాణికులను చేరవేస్తుంది. దాదాపు 740 మంది ప్రయాణించే వీలున్న ఈ నౌక మంగళవారం సాయంత్రం 506 మంది ప్రయాణికులతో బయలుదేరింది. 60 మంది వరకూ నౌకా సిబ్బంది ఉన్నారు. పోర్టుబ్లెయిర్ చేరుకునేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతుంది. 14 నాటికల్‌మైళ్లు ప్రయాణించాక, అర్ధరాత్రి సమయంలో ఇంజన్ జనరేటర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నడిసముద్రంలో నౌకకు లంగరు వేశారు. ఇంజన్ జనరేటర్‌కు తొలుత సిబ్బంది మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించారు. సాంకేతిక లోపం గురించి ప్రయాణికులకు సిబ్బంది తెలిపారు. కానీ బుధవారం ఉదయానికి కూడా మరమ్మతు చేయలేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. ఇది సాధారణ లోపంగా తాము భావించామని, ఉదయానికి కూడా రాత్రి లంగరు వేసిన దగ్గరే ఉండటాన్ని గమనించామని పోర్టు బ్లెయిర్‌లో ఆటో మెకానిక్‌గా పని చేస్తున్న బి.అప్పలనాయుడు తెలిపారు. దాదాపు మూడు రోజుల ప్రయాణంలో ఇక్కడే రెండు రోజులు గడిచిపోయాయని, చాలా మంది సీ సిక్‌నెస్ కారణంగా తదుపరి ప్రయాణం చేయలేరని తెలిపారు. ఈ నౌకలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన చాలా మంది ఉపాధి నిమిత్తం అక్కడ స్థిరపడిన వారు ఉన్నారు. స్వస్థలాలకు వచ్చి తిరిగి అండమాన్ వెళ్తున్నారు. ఈ విషయమై విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరనాథ్ మాట్లాడుతూ నౌక కెప్టెన్ తమను సంప్రదించలేదని, ఆ సాంకేతిక లోపాన్ని తామే సరిచేయగలమని భావించారని తెలిపారు. తాము కెప్టెన్‌ను సంప్రదించినప్పుడు ఆ లోపాన్ని సరిచేయగలమని తెలిపారన్నారు. నౌకలోని నాలుగు ఇంజన్ జనరేటర్లలో ఒకదానిలో సాంకేతిక లోపం తలెత్తిందన్నారు. దీంతో తప్పనిసరిగా లంగరు వేయాల్సిన పరిస్థితి నెలకొందని, అయితే మిగిలిన మూడు పని చేస్తుండటం వల్ల నౌకలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదన్నారు. నౌకలో ఆహారం, నీరు తగినంతగా ఉన్నాయని, అవసరమైతే పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే సేవలు అందించేందుకు వీలుగా నౌకదళానికి చెందిన నిపుణులను కూడా సిద్ధం చేశారు. పోర్టుబ్లెయిర్‌లోనే పుట్టి పెరిగి అక్కడ ఆటో నడుపుతున్న రమణ తన అత్తమామలను చూసేందుకు ఇటీవల విశాఖ వచ్చారు. తిరుగు ప్రయాణంలో నౌక నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తీరానికి సమీపంలో లోపం తలెత్తడంతో కొంత మేలు జరిగిందని, ప్రయాణం మధ్యలో జరిగి ఉంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేదని తెలిపారు.