తెలంగాణ

వాగు దాటబోయ యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిట్లం, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామం ఐదు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుపో యంది. గురువారం వాగు దాటే క్రమంలో కుర్తికి చెందిన వీరబోయిన అంజయ్య (34) అనే యువకుడు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయి నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. కుర్తి గ్రామం ఆవలి ఒడ్డున ఉండే తన అత్త, భార్యను కలిసేందుకు అంజయ్య, అతని మామ భూషయ్య, గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఎండిన సొరకాయలను వీపునకు కట్టుకుని వాగులో ఈదుతూ వెళ్లారు. వాగు మధ్యలోకి చేరుకునేసరికి నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అంజయ్య ఊపిరాడక మృతి చెంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మిగతా వారు ఈదుతూ అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. కుర్తి గ్రామానికి వెళ్లేందుకు వంతెన ఉన్నప్పటికీ, అది కూడా నీటిలో మునిగిపోయింది. గ్రామస్తులను ఆవలి వైపున ఉండే ఒడ్డుకు చేర్చేందుకు ప్రభు త్వం బోటు సౌకర్యం కూడా కల్పించింది. బోటు నడిపే వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎంపిడిఓ పర్బన్న, తహశీల్దార్ నర్సింహారావు, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎం పిపి రజనీకాంత్‌రెడ్డి, జడ్పీటిసి ప్రతాప్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అంజయ్య ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపులు జరిపిస్తున్నారు.

చిత్రం.. వాగు ఉద్ధృతిలో కొట్టుకుపోతున్న అంజయ్య ఇన్‌సెట్‌లో (ఫైల్ ఫొటో)