తెలంగాణ

ఎల్‌ఎండి నిండుకుండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 30: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి లోయర్ మానేర్ డ్యాం (ఎల్‌ఎండి)లో చేరింది. ఎల్‌ఎండి నిండుకుండలా మారడంతో శుక్రవారం తెల్లవారుఝామున 8గేట్లు, మధ్యాహ్నం వరకు మరో 3గేట్లు మొత్తం 11 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదిలారు. మూడు రోజుల క్రితం ఉదయం ఆరు గేట్లను ఎత్తగా, తిరిగి సాయంత్రం గేట్లను మూసివేశారు. అయితే, మళ్లీ ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో ఎల్‌ఎండి పూర్తిస్థాయి (24టిఎంసిలు)లో నిండింది. దీంతో 11గేట్లను ఎత్తిన నీటి పారుదల శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. జలాశయంలోకి ఎంత వరద నీరు వచ్చి చేరుతుందో అంతే నీరును దిగువనకు వదులుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత ఎల్‌ఎండి గేట్లు ఎత్తడం, దసరా సెలవులు రావడంతో ఎల్‌ఎండికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు సందర్శకులతో ఎల్‌ఎండితోపాటు పరిసరాలు సందడి సందడిగా మారాయి. జలాశయం పూర్తిగా నిండటంతో రెండుమూడేళ్ల దాకా తాగునీటికి ఇబ్బందుల్లేవంటూ నగర ప్రజలు ఆనందపడుతున్నారు.

లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తిన దృశ్యం