తెలంగాణ

వద్దంటే వాగులోకి తీసుకెళ్లి నీటముంచాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 1: డ్రైవర్ అనుభవ రాహిత్యంతో ఐదుగురు చిన్నారులు సహా ఓ మహిళ నిండుప్రాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటిస్తానన్న మితిమీరిన ఆత్మవిస్వాసమే విలువైన ప్రాణాలను బలిగొంది. మెదక్ జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన జంగం శంకర్ ట్రాన్స్‌కోలో లైన్‌మెన్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు కుమారులు పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఐదారేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడిన శంకర్ మృతి చెందాడు. శంకర్ పెద్ద కుమారుడైన రాజుకు ట్రాన్స్‌కోలోనే లైన్‌మెన్‌గా ఉద్యోగం లభించింది. కొద్దిరోజుల పాటు స్వగ్రామమైన తడ్కల్‌లోనే రాజు లైన్‌మెన్‌గా పనిచేసాడు. బదిలీపై రేగోడ్ మండలానికి వచ్చాడు. రేగోడ్‌కు, తడ్కల్‌కు పెద్ద దూరం లేకపోవడంతో స్వగ్రామంలోనే భార్య, పిల్లలను ఉంచుతూ తాను మాత్రం ఉద్యోగం కోసం రేగోడ్‌కు రాకపోకలు సాగిస్తున్నాడు. కాగా రాజు, రాజమణి దంపతులకు ఐదుగురు ఆడ సంతానం ఉన్నారు. వీరిలో శ్రీయ పెద్ద కూతురుకు, రెండవ కూతురు జ్యోతికి కేవలం యేడాది మాత్రమే వయస్సు తేడా ఉంది. మరో యేడాదికి గంగ, గౌరి అనే కవల పిల్లలు జన్మించారు. వీరి వయస్సు మూడేళ్లు. మరో యేడాదిన్నరకు దీక్షిత అనే 13 నెలల పాప జన్మించింది. పుత్ర వాత్సల్యం కోసం తాపత్రయ పడిన రాజ, రాజమణి దంపతుల ఆశ నెరవేరకపోగా ఐదుగురూ ఆడ పిల్లలే జన్మించారు. వారినే కుమారులుగా భావిస్తున్న ఆ దంపతులు మొదటి, రెండవ కూతుళ్లను తడ్కల్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటున్నారు. చిన్న కూతురు దీక్షిత కాలుపై శనివారం ఉదయం వేడి టీ పడడంతో బొబ్బలు వచ్చాయి. రాజు సూచనల మేరకు నిజామాబాద్ జిల్లాలోని పిట్లం తీసుకువెళ్లి చికిత్స చేయించాలని ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ మేరకు రాజు కారును అదే గ్రామానికి చెందిన ఇస్మాయిల్ అనే డ్రైవర్‌తో రాజు సోదరుడు నవీన్, రాజమణి, ఐదుగురు పిల్లలు బయలుదేరారు. శుక్రవారం రాత్రంతా భారీ వర్షాలు కురియడంతో కంగ్టి మండలంలోని వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయన్న కనీస జ్ఞానం లేని డ్రైవర్ కారులో వారిని ఎక్కించుకుని బయలుదేరారు. వాగు ఉధృతిని గమనించకపోవడంతో అలాగే ప్రయాణించడం వల్ల ఒక్కసారిగా కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి ఇస్మాయిల్‌తో పాటు నవీన్ ఈదుకుంటూ వడ్డుకు చేరుకున్నారు. తల్లి, ఐదుగురు కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు మాత్రం అర కిలోమీటర్ వరకు కొట్టుకుపోయి నిల్చిపోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి శవాలను ఒడ్డుకు చేర్చిన స్థానికులు కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసారు. ప్రమాద విషయం తెలుసుకున్న లైన్‌మెన్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపిస్తూ వాగులోంచి అవతలి ఒడ్డుకు వెళ్లే ప్రయత్నం చేయగా స్థానికులు ఒడిసిపట్టుకుని ఓదార్చేందుకు విఫలయత్నం చేసారు. ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు వాగుకు ఇరువైపుల ఉన్న వారంతా వద్దంటూ నివారించినా డ్రైవర్ వినిపించుకోకుండా అలాగే తీసుకువెళ్లాడన్న చర్చ కొనసాగుతుంది. డ్రైవర్ ఎప్పుడు మద్యం తాగి ఉంటాడన్న ఆరోపణలు కూడా నెలకొన్నాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మొత్తంమీద సరిహద్దు మండలమైన కంగ్టిలో ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి వాగునీటిలో మృతి చెందిన సంఘటన పెను విషాదం నింపింది.