తెలంగాణ

అమ్మవారికి నాలుగున్నర కేజీల బంగారు చీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 1: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాసవీమాత అమ్మవారికి భక్తులు నాలుగున్నర కేజీల బంగారం చీరను బహూకరించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని కన్యకాపరమేశ్వరిమాతకు శనివారం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులతో పాటు భక్తుల సహకారంతో తయారు చేసిన బంగారు చీరను అమ్మవారికి అలంకరించారు. శరన్నవరాత్రిలో భాగంగా బంగారు చీరలో వాసవీమాత భక్తులకు స్వర్ణాలంకృత దేవిగా దర్శనమిచ్చారు. కాగా, అమ్మవారి బంగారు చీరను చూసేందుకు పాలమూరు పట్టణంలో మహిళలు కన్యకాపరవేశ్వరి దేవాలయానికి పోట్టెత్తారు. అమ్మవారిని కనులారా బంగారు చీరలో చూసిన భక్తులు తరించిపోయారు. అంతకుముందు అమ్మవారి బంగారు చీరను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దంపతులతో పాటు వందలాది మంది భక్తులు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచారు.

చిత్రం.. పాలమూరు పట్టణంలో బంగారు చీరతో
స్వర్ణాలంకృతదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన వాసవీమాత