తెలంగాణ

రూ. 8లక్షల చొప్పున పరిహారం చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆదిలాబాద్ జిల్లా దహెగాం గ్రామంలో పాముకాటుకు గురై మరణించిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు రూ. 8 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు శనివారం తెలంగాణ రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌ను ఆదేశించింది. 2006 ఆగస్టు 23వ తేదీన రాజేశ్వరి, లక్ష్మి అనే ఇద్దరు విద్యార్థినులు దహెగాం గ్రామంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలో పాముకాటుకు గురై మరణించారు. ఈ కేసులో విద్యార్థినుల తండ్రులు ములుకుట్ల పోచయ్య, కంబాల మల్లేష్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమార్తెలు స్కూలులో పాముకాటుకు గురై మరణించినందు వల్ల రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు విచారించారు. పాము కాటుకు గురైన వెంటనే ఈ ఇద్దరు విద్యార్థినులను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పాఠశాల అధికారులు విఫలమయ్యారని హైకోర్టు విచారణలో గుర్తించింది. విద్యార్థినుల సంక్షేమాన్ని పరిరక్షించడంలో పాఠశాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రాణాలకు హాని కలిగించే వాతావరణంలో ఉన్న ఇటువంటి కనీస సదుపాయాలు లేని పాఠశాలలను మూసివేయడం మంచిదని హైకోర్టు పేర్కొంది. ఖమ్మం జిల్లాలో కూడా ఇటీవల ఇద్దరు విద్యార్థినులు మరణించిన సమాచారం హైకోర్టు దృష్టికి వచ్చింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు తీరని అన్యాయం జరిగిందని జస్టిస్ నవీన్‌రావు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరణించిన ఇద్దరు పిల్లల కుటుంబాలకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించడం సమంజసం అని ఆయన అన్నారు. దీని వల్ల తల్లిదండ్రులకు కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందన్నారు.
సర్వశిక్ష అభియాన్ అధికారులు వెంటనే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను తెరిచి ఐదు లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాలని ఆదేశించారు. మిగిలిన మూడు లక్షల రూపాయలను మరణించిన విద్యార్థినుల చెల్లెళ్ల పేరు మీద డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే 12 వారాల్లోగా మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.