తెలంగాణ

14ఏళ్లు అజ్ఞాతంలో ఉన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: గ్యాంగ్‌స్టర్ నరుూం భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. పద్నాలుగేళ్లు అజ్ఞాతంలో ఉన్న కృష్ణ, గ్యాంగ్‌స్టర్ నరుూం హతమైన 52రోజులకు అజ్ఞాతం వీడారు. నల్గొండ జిల్లా భువనగిరికి చేరిన కృష్ణ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రాణాలు కాపాడుకోవడానికే రహస్య జీవితం గడపాల్సి వచ్చిందని, నరుూం, అతని అనుచరుల భయంతో నరకం అనుభవించానని తెలిపారు. సారా వ్యతిరేక, సామాజిక ఉద్యమాలతో తన సోదరి బెల్లి లలిత మంచి పేరు తెచ్చుకుందని, ఆమె పాడిన పాటలు కూడా మంచి ఆదరణ పొందాయని తెలిపారు. భువనగిరి ప్రాంతంలోనే బెల్లి లలిత తన పాటలతో సంచలనం సృష్టించిందన్నారు. ప్రజల్లో మమేకమైన ఆమెను పౌర హక్కుల నేతంటూ నరుూం ముఠా కొంత మంది రాజకీయ నాయకుల అండతో 1999 మే 26న దారుణంగా హత్య చేసిందని కృష్ణ కంట తడిపెట్టారు. బెల్లి లలితను చంపింది నరుూం అయినా..చంపించింది మాత్రం నాటి ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. లలితకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఒక అన్న ఉన్నారు. ఆమెను హత్య చేసిన తరువాత లలిత సోదరి భర్త విప్లవ రచయితల సంఘం సభ్యుడు ముక్కా కరుణాకర్‌ను నరుూం ముఠా వేటాడి, వెంటాడి నరికి చంపింది. అదే ఏడాది డిసెంబర్ 26న ఆమె మరో సోదరి భర్త శ్రీరాములుతోపాటు సిద్ధూ, మల్లేష్ యాదవ్‌లను చౌటుప్పల్ దగ్గర దారికాచి నరుూం ముఠా అతిదారుణంగా నరికి చంపింది. ఈ ఘటనల నేపథ్యంలో నరుూం సోదరుడి హత్య జరిగింది. ఈ హత్యకు సూత్రధారి లలిత సోదరుడు కృష్ణ అంటూ నరుూం తనను వేధింపులకు గురిచేశాడని, దీంతో రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న తాను 2001లో రహస్య జీవితంలోకి వెళ్లిపోవాల్సి వచ్చిందని కృష్ణ వెల్లడించారు.
నరుూంతో శతృత్వం లేదు
నరుూం తన స్కూల్ మేట్ అని, అతనితో ఎలాంటి శతృత్వం లేదని, కలసి చదువుకున్నామని, ఇద్దరం కలసి ఆడి పాడామని కృష్ణ చెప్పారు. ఒకే ఊరు..ఒకే పాఠశాల కాబట్టి మిత్రులమయ్యామని, కానీ టిడిపి ప్రభుత్వ హయాంలో కొందరు రాజకీయ నాయకులు కూడబలుక్కుని తన సోదరిని హత్య చేయించి, తమ కుటుంబాన్ని బజారు పాల్జేశారని కృష్ణ ఆరోపించారు.