హైదరాబాద్

ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేయండి: తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస కారు గుర్తుకు ఓటువేస్తే గ్రేటర్‌లో మరింత శరవేగంగా అభివృద్ధి చోటు చేసుకుంటుందని అన్నారు. ఇక వరదనీరు ముంచెత్తడాలు, మంచినీటి ఇబ్బందులు శాశ్వతంగా దూరమవుతాయని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోకొద్దిగా అభివృద్ధి చేస్తే చేయొచ్చుగాక మరి ఇపుడు రాష్ట్రం విడిపోయింది, ఆయన ప్రక్కరాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి నిధులు ఎక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మాటవరుసకు సిఎం కేసిఆర్ భువనేశ్వరీదేవిని మా వదిన ఇక్కడే ఉంటుంది కాబట్టి మాకే ఓటు వేస్తుందని అంటే అందులో తప్పేమి ఉందని దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, ఇందులో అర్థం లేదని తలసాని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబునాయుడు బిజెపితో పొత్తుపెట్టుకుని నా జీవితంలో పెద్దతప్పు చేశానని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారని, మరి ఎందుకు మరోసారి తప్పు చేశారని తలసాని ప్రశ్నించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ చాలా అమాయకుడని ఆయన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎవరు నిర్మిస్తున్నారో తెలియనంత అమాయకంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లకు నాంది పలికారని, కాని అవి కేంద్రప్రభుత్వం నిర్మిస్తోందని దత్తాత్రేయ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తే మరి గుజరాత్‌తోపాటు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు నిర్మించడం లేదో సెలవియ్యాలని అన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులకు అసలు జిహెచ్‌ఎంసి పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలేంటో తెలియవని అన్నారు. ఉచితంగా మంచినీటికి జిహెచ్‌ఎంసికి, ఉచిత విద్యుత్‌కు జిహెచ్‌ఎంసికి, శాంతిభద్రతలకు జిహెచ్‌ఎంసికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ఏది పడితే అది మాట్లాడడం కాదు, ప్రజలు నమ్మకం కలిగించడానికి వాస్తవాలు చెప్పాలన్నారు.

తలసాని హితవు పలికారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో తెరాస కార్పొరేటర్‌లు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడరని ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా భవిష్యత్‌లో ఎలాంటి అవినీతి కార్యక్రమాలు ప్రజల దృష్టికి వచ్చినా తనకు ఫోన్ చేయాలని తలసాని ఫోన్ నెంబర్‌ను ఇచ్చారు. విజన్‌తో పనిచేస్తున్న కెసిఆర్ సర్కార్‌కు బాసటగా నిలిచి అవినీతిరహిత అభివృద్ధితో కూడిన గ్రేటర్ హైద్రాబాద్‌కోసం నగర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలసాని ప్రజలను కోరారు.

బైక్ ర్యాలీలతో ముగిసిన ప్రచారం
* ఓటర్లను ఆకర్షించడానికి
ఇక డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం
ఉప్పల్, జనవరి 31: గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ఐదుగంటల నాటికి ముగిసింది. ఇప్పటి వరకు 15 రోజులుగా మోగిన మైకులు, డప్పుచప్పుళ్లు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు ముగిశాయి. చివరి రోజు ఉప్పల్ సర్కిల్‌లోని నాలుగు డివిజన్లలో అభ్యర్థులు బైక్ ర్యాలీలతో హోరెత్తించి ముగించారు. చిల్కానగర్ డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి గోపు సరస్వతి సదానంద్‌కు మద్ధతుగా మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా టిడిపి నేతలు టిఆర్‌ఎస్‌లో చేరి సరస్వతికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెన్‌రెడ్డి లతా రఘుపతిరెడ్డిని గెలిపించాలని, బిజెపి అభ్యర్థి బి.అనీతా పర్వేష్‌ను గెలిపించాలని పార్టీ నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. చిల్కానగర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొని అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
హబ్సిగూడ డివిజన్‌లో..టిడిపి అభ్యర్థి బొబ్బల రమా రమణారెడ్డి, బిజెపి అభ్యర్థి తిండేరు సురేఖ హన్మంతరావు, కాంగ్రెస్ అభ్యర్థి పసుల మంజుల ప్రభాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ అభ్యర్థి బేతి స్వప్న సుభాష్‌రెడ్డి, సిపిఎం అభ్యర్థి ఎడ్ల సుజాతను గెలిపించాలని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. రామంతాపూర్ వెంకట్‌రెడ్డినగర్ నుండి ఓయూ క్యాంపస్ మురికి వాడల వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. బిజెపి అభ్యర్థి తిండేరు సురేఖను గెలిపించాలని వెంకట్‌రెడ్డినగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొని అభివృద్ధి జరగాలంటే బిజెపిని గెలిపించాలని కోరారు.
రామంతాపూర్ డివిజన్‌లో.. కాంగ్రెస్ అభ్యర్థి పి.సరిత శ్రీకాంత్‌గౌడ్, బిజెపి అభ్యర్థి వల్లపు దీపిక జగన్‌యాదవ్, టిఆర్‌ఎస్ అభ్యర్థి జి.జ్యోత్న నాగేశ్వర్‌రావు, సిపిఎం అభ్యర్థి పి.లక్ష్మీదేవి, స్వతంత్ర అభ్యర్థులు తవిడబోయిన దుర్గాబాయి, సర్వ రాణియాదవ్‌కు మద్ధతుగా ఆదివారం ఆయా పార్టీల నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఉప్పల్ డివిజన్‌లో..టిడిపి అభ్యర్థి కందికంటి మంజుల అశోక్‌గౌడ్, టిఆర్‌ఎస్ అభ్యర్థి మేకల అనలా హన్మంత్‌రెడ్డి, బిజెపి అభ్యర్థి మహంకాళీ రూపారాణి లక్ష్మణ్, కాంగ్రెస్ అభ్యర్థి ముశ్యం శారదారాణి, సిపిఎం అభ్యర్థి జి.ప్రపూర్ణను గెలిపించాలని ఆయా పార్టీల నేతలు చివరి రోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ రెబల్ స్వతంత్ర అభ్యర్థి ఎం.రజితకు మద్ధతుగా మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి న్యూవిజయపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నేతలు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం
ప్రచారానికి తెరపడటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి మద్యం, డబ్బులను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్‌లో ఇప్పటికే కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాలతో ప్రత్యేక రహస్య సమావేశాలను నిర్వహించి ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని మా పార్టీలకే పడేట్లు చూస్తే ఇంత ప్యాకేజి ప్రకటిస్తున్నట్లు తెలిసింది. రాత్రి వేళల్లో డబ్బులు, విలువైన మద్యం, డిన్నర్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. ఉప్పల్ డివిజన్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకోవడానికి మద్ధతుదారులు ఓటుకు వెయ్యి చొప్పున పంచి మద్యంతో డిన్నర్లు ఇస్తున్నట్లు విన్పిస్తోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులను దడ పుట్టించేవిధంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా బయటపడినట్లు తెలిసింది. విచ్చల విడిగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు పెట్టకపోవడం శోచనీయమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టిఆర్‌ఎస్‌వి బూటకపు హామీలు
జవహర్‌నగర్: టిఆర్‌ఎస్ ప్రభుత్వం బూటకపు హామీల ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యాప్రాల్ పరిధిలో రోడ్డు షో, బైకు ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పేదల సంక్షేమం కోసం పాటుపడిన పార్టీలు టిడిపి బిజెపిలేనని కొనియాడారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని తెలంగాణ వచ్చిన తరువాత మాట మర్చిన ఘనుడని ఎద్దేవా చేసాడు. తెలంగాణలో ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ముఖ్యమంత్రి పదవి దళితునికే ఇస్తానని అన్న కేసిఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే మాట మర్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. గ్రేటర్‌లో వారంరోజులకు ఒక్కసారి కూడా మంచీనీరు రావడం లేదని, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని ఎన్నికలలో టిడిపి, బిజెపి అభ్యర్ధులను గెలిపిస్తారని అన్నారు. నేరేడ్‌మెట్ డివిజన్ బిజెపి అభ్యర్ధి ఎన్ ప్రసన్న మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు. ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ కేసిఆర్ చేయని పనులన్నీ చేసినట్టు చెప్పడం హాస్యంగా ఉందని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో పిట్ల మోహన్‌రాజ్, ధనలక్ష్మీ, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
డేగ కళ్లతో అభ్యర్థుల కదలికలపై నిఘా
సికింద్రాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. చివరిరోజు ప్రచారం కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ర్యాలీలు చేపట్టారు. ముఖ్యంగా బైక్‌ర్యాలీలు చేపట్టడంతో అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద యువకులు తమ బైక్‌లలో పెట్రోల్ పోయించుకునేందుకు క్యూలు కట్టారు. ఆదివారం ఉదయం నుంచి ఆయా పార్టీల క్యాడర్‌లు జెండాలు చేతపట్టుకుని రోడ్లపై తిరుగుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. సికింద్రాబాద్‌లో తెరాసతోపాటు, తెలుగుదేశం పార్టీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్ధులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆదివారం అన్ని ప్రాంతాల్లో ప్రచారాలు హోరెత్తించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక సికింద్రాబాద్‌లో కొంత మంది అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు పంచుతున్నారన్న ఫిర్యాదులు అందడంతో అభ్యర్థుల కదలికలపై గట్టి నిఘాపెట్టారు.