రాష్ట్రీయం

కలహాల కాపురంకంటే విడాకులే మేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: కోర్టులు తమ వద్దకు వచ్చే విడాకుల పిటిషన్‌లకు సంబంధించి వీలైనంత వరకు దంపతులు కలిసి కాపురం చేసేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో వారు కలిసి ఉండలేని పక్షంలో బలవంతంగా కలిపేందుకు ఒత్తిడి చేస్తే బెడిసికొడుతుందని హైకోర్టు పేర్కొంది. విడాకులకు సంబంధించి ఒక కేసులో జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఒకసారి దంపతులు విడిపోయి, చాలా సంవత్సరాలు వేరువేరుగా ఉన్న తర్వాత వారిలో ఒకరు విడాకులకు పిటిషన్ దాఖలు చేస్తే, అప్పటికే ఆ పెళ్లి భగ్నమైనట్లుగా భావించాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యతో 1995 నుంచి విడిపోయి వేరుగా ఉన్నానని, కాని కింది కోర్టు విడాకులు కోరితే తిరస్కరించిందని, తనకు న్యాయం చేయాలని హైకోర్టును అభ్యర్ధించారు. ఈ కేసులో కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చి, ఈ వ్యక్తికి విడాకులు మంజూరుచేసింది. ఈ సందర్భంగా హైకోర్టు భార్యా భర్తల సంసార బంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్ధానాలు తప్పనిసరిగా సంసారాలు నిలబెట్టేందుకు తమ పరిధిలో చివరి వరకు కృషి చేయాల్సిందే. భార్యా భర్తల మధ్య అనుబంధం లోపించి, కలిసి ఉండలేని పరిస్థితి ఉత్పన్నమై, పెళ్లి భగ్నమైతే, ఇక విడాకులను నిలుపుదల చేయరాదని అభిప్రాయ పడింది.. ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జునరెడ్డి వ్యాఖ్యానిస్తూ, వివాహమంటే రెండు ఆత్మలు, దేహాల కలయిక. దంపతులు మధ్య సుహృద్భావ వాతావరణం, అన్యోన్యం ఉన్నంతవరకు వారి వివాహబంధం పటిష్టంగా ఉంటుంది. సంసారమంటే అప్పుడప్పుడు భార్యా భర్తల మధ్య కలతలు తప్పవు. ఇవి అసాధారణమేమీకావు. కాని పిల్లి, ఎలుకల మాదిరిగా, ముంగిస, పాము మాదిరిగా భార్యా భర్తలు జగడాలకు దిగుతుంటే ఇద్దరి జీవితం నరకప్రాయమవుతుంది. ఒకసారి దంపతుల మధ్య పరస్పర విశ్వాసం, ప్రేమ భగ్నమైందంటే, మళ్లీ అనుబంధాన్ని పునరుద్ధరించడం అంత సులభం కాదు. ముందుగా విడాకులు కోరినప్పుడు దంపతుల మధ్య అన్యోన్యతను పునర్ధురించేందుకు కోర్టు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు ఫలించని పక్షంలో దంపతులను బలవంతంగా కలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తే సరైన ఫలితాలు ఇవ్వవు. కలిసి ఉండి, దిగులుతో గడిపే బదులు, ప్రతి నిత్యం కలహించుకునే భార్యా భర్తలకు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వారు గడపడం మంచిదని హైకోర్టు అభిప్రాయపడింది.