తెలంగాణ

రెవెన్యూ ఉద్యోగులను కుదించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఖ్యను కుదించకూడదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ట్రెసా అధ్యక్షుడు ఎం. శివశంకర్ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం ఇక్కడ జరిగింది. రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా తీర్మానాలు చేశారు. ఉద్యోగుల సంఖ్యను కుదించడం వల్ల పరిపాలనాపరంగా ఇక్కట్లు ఏర్పడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని తహశీల్దార్లందరికీ ఒకే రకమైన వాహనాలను సమకూర్చాలని కోరారు. మండల కార్యాలయాల్లో అదనంగా జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని కోరారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో భూసేకరణ తహశీల్దారు పోస్టును క్రియేట్ చేయాలని కార్యవర్గం కోరింది.
జిల్లా జాయింట్ కలెక్టర్ పోస్టులో రెవెన్యూ అధికారులనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తహశీల్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని, రెవెన్యూ ఉద్యోగులందరికీ శిక్షణా తరగతులు నిర్వహించాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా జరిగే బదిలీలు ఐచ్ఛికంగా అంటే వారి అభీష్టం మేరకు చేయాలని కోరారు. ఉద్యోగులకు బదిలీలపై అవకాశం (ఆప్షన్) ఇవ్వాలని తీర్మానించారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులంతా ఎన్ని ఇబ్బందులెదురైనా ధైర్యంగా పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తమ ఉద్యోగులను కోరుతూ తీర్మానించారు. ఈ సమావేశంలో అసోసియేన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, కోశాధికారి ఎల్‌బి శాస్ర్తీ, కల్చరల్ సెక్రటరీ ప్రభాకర్, జిల్లా శాఖల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం దృశ్యం