తెలంగాణ

పగటిపూట వ్యవసాయానికి 9గంటల విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ఈ సారి రాష్టవ్య్రాప్తంగా మంచి వర్షాలు కురవడంతో రబీలో రైతులు ప్రతీ ఎకరం సాగు చేసుకునేందుకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌కల్లా రాష్ట్రంలో అన్ని రకాలుగా తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని మరో వెయ్యి మెగావాట్లు చత్తీస్‌గడ్ నుంచి అందుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్లపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావుతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్షించారు. మంచి వర్షాల వల్ల బావుల్లో నీరు నిండిందని, భూగర్భ జల మట్టాలు కూడా బాగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో పంపు సెట్ల ద్వారానే ఎక్కువగా వ్యవసాయం సాగవుతుండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.