తెలంగాణ

కొత్త జిల్లాల్లో సేద్యం కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల్లో వ్యవసాయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, వ్యవసాయ శాఖ కమిషనర్ (ఎఫ్‌ఎసి) సి. పార్థసారథి ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్షించారు. అడిషనల్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాల్లో కొత్త కార్యాలయాలకు భవనాలు ఎంపిక చేయాలని, కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన ఫర్నీచర్, సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ నెల 11న కొత్త కార్యాలయాలను ప్రారంభించాలని ఆదేశించారు. 2016-17 రబీ సీజన్‌లో రైతులకు అవసమైన విత్తనాలను సిద్ధంగా ఉంచాలని పార్థసారథి ఆదేశించారు. వర్షాల వల్ల జలాశయాల్లోకి నీరు రావడంతో వరి తదితర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో వేసే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల్లోని వ్యవసాయ సిబ్బంది ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని పిలుపు ఇచ్చారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల మూలంగా పంటలకు జరిగిన నష్టం వివరాలను సమగ్రంగా సేకరించి పంపించాలని ఆదేశించారు. పంటల బీమా పరిధిలోకి వచ్చే రైతులకు నిబంధనల ప్రకారం సాయం చేయాల్సి ఉందన్నారు.

చిత్రం.. సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న కమిషనర్ పార్థసారధి