తెలంగాణ

ఎమ్మెల్సీకి ఫరీదుద్దీన్ నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3:శాసన మండలి సభ్యత్వానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ టిఆర్‌ఎస్ తరపున సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఫరీదుద్దీన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఫరీదుద్దీన్ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు ఫరీదుద్దీన్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నాయిని నర్సింహ్మారెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామచంద్రారెడ్డి, ప్రభాకర్ కార్యక్రమానికి హాజరయ్యారు.

చిత్రం.. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేస్తున్న ఫరీదుద్దీన్