తెలంగాణ

ఫ్రాన్స్‌తో టిఎస్‌ఆర్టీసి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టిఎస్‌ఆర్టీసి ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది. పారిస్‌లోని రెజీ ఆటోనోమి డెన్ ట్రాన్స్‌పోర్ట్స్ పరిషియన్స్ (ఆర్‌ఎటిపి) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫాస్కల్ సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్నారు. దేశంలోనే ఈ ఒప్పందం మొట్టమొదటిగా పేర్కొనబడినదని ఆర్టీసి సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.
బస్సు ఏ స్థలంలో ఉన్నదో కనుగొనడం, సమయాన్ని పరిశీలించడం, ప్రయాణికులకు సమాచారం అందించడం, ప్రయాణికుల సౌలభ్యం మేరకు సోలార్ డిస్ప్లే సిస్టమ్, ఆధునికీకరణ విధానాలకు సంబంధించిన అంశాలపై ఎంఓయు కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ద్వారా అమలు పరచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం నిధులు సమకూర్చేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించింది. అలాగే సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావుతో పాటు సికిందరాబాద్ రీజినల్ మేనేజర్ కొమరయ్య జర్మనీ, పారిస్‌లో రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసి వచ్చారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1వరకు జర్మనీ, పారిస్ దేశాల్లో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ ప్రతినిధులతో పాటు టిఎస్‌ఆర్టీసి అధికారుల బృందం కలసి రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసింది.

చిత్రం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫాస్కల్‌తో టిఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండి జివి రమణారావు తదితరులు