తెలంగాణ

రాజీనామా పేరుతో అరుణ డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయలేదని టిఆర్‌ఎస్ ఎంపిలు బి. వినోద్, బాల్కసుమన్‌లు విమర్శించారు. ఇద్దరు ఎంపిలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా పేరుతో డ్రామా ఆడుతున్నారని అన్నారు. సరైన ఫార్మెట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలి కానీ చెత్త బుట్టలో వేయాల్సిన విధంగా లేఖ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. సరైన ఫార్మెట్‌లో రాజీనామా లేదని వినోద్ తెలిపారు. షరతులు విధించి రాజీనామా లేఖ ఇస్తే అది చెల్లదని, అది రాజీనామానే కాదు స్పీకర్ చెత్తబుట్టలో వేస్తారని అన్నారు. డికె అరుణది చిల్లర రాజకీయం, రాజీనామా ఎలా చేయాలో మమ్ములను అడిగితే చెప్పేవాళ్లం అని అన్నారు. అస్తులు,వ్యాపారాలు పెంచుకోవడం తప్ప వారికి వేరే పని లేదని అన్నారు. గద్వాలలో ఆమె ప్రజల పక్షాన ఏనాడూ నిలబడలేదని అన్నారు.
కరీంనగర్‌ను నాలుగు జిల్లాలు చేయమని ముఖ్యమంత్రిని కోరినట్టు సుమన్ తెలిపారు. మొదట్లో కొడుకుకు ఒక జిల్లా అల్లుడికి ఒక జిల్లా అని విమర్శించారని గుర్తు చేశారు. ముసాయిదాలో సిరిసిల్ల పేరు లేకపోయే సరికి మాట మార్చారని, విపక్షాలది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగానే జిల్లాల ఏర్పాటు జరుగుతుందని, చట్ట ప్రకారమే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. గత పాలకులు జిల్లాల ఏర్పాటుపై కనీసం ఆలోచన కూడా చేయలేదని అన్నారు. రామగుండం, పెద్దపల్లి పరిధిలోని కాల్వ శ్రీరాంపూర్‌ను కరీంనగర్‌లోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రిని కోరినట్టు చెప్పారు. ప్రతి వ్యక్తికి పాలనా ప్రయోజనం అందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జిల్లాల విభజన చేస్తున్నారని తెలిపారు.