తెలంగాణ

ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 3: తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు, పరిశ్రమలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్టుల పేరుతో రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే సహించేదిలేదని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి హెచ్చరించారు. సోమవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులపాలిట విలన్‌గామారి ప్రాజెక్టుల పేరుతో బలవంతంగా భూములను లాక్కుంటున్నారని అన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకోసం సంగెం, గీసుకొండ మండలాల పరిధిలోని దాదాపు 3వేల ఎకరాల భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కొనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకోసం రాష్ట్రప్రభుత్వం లోక్‌సభలో ఆమోదం పొందిన 2013చట్ట ప్రకారమే భూసేకరణ చేయాలేతప్పా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసుకున్న జిఓ 123, 45 ప్రకారం భూసేకరణ చేయకూడదని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వ జిఓ 123కోర్టులో సస్పెన్షన్‌లో ఉందని అన్నారు. ప్రభుత్వం కోర్టు ఆదేశాలను కూడా దిక్కరించి ముందుకుపోతుందని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం ఇలా మెండిగా వెళ్లి కోర్టుచే మొట్టికాయ పడిందని గుర్తుచేసారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇలా మెండిగా వెళ్తె ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మెదక్‌లో మల్లన్నసాగర్, రంగారెడ్డిజిల్లాలో ఫార్మసి, మహాబూబ్‌నగర్‌లో పాలమూరు ఎత్తిపోతలపథకం, వరంగల్‌లో టెక్స్‌టైల్‌పార్కు విషయంలో రైతులు నష్టపోకుండా 2013 చట్టప్రకారమే భూసేకర చేయాలని అన్నారు. రైతులు ఒప్పుకుంటే పర్వలేదని అన్నారు. బలవంతంగా పచ్చని పంటలతో కళకళలాడే భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే వ్యవసాయానే్న నమ్ముకొని ఉన్న అన్నదాతల పరిస్ధితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్ధితుల్లో నేరుగా ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి భూసేకరణ చేయాలని ఆయన డిమాండ్ చేసారు. పరిశ్రమల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన ఉండాల్సిన స్ధానిక పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఏకంగా అధికారులతో ఏకపక్షంగా భూసేకరణకు రావడం సరికాదని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇంచార్జీ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 2013చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని, లేనట్లైతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.