తెలంగాణ

ఏడు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలోని ఏడు వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మార్కెట్ కమిటీకి నల్లగంటి వెంకటయ్యను చైర్మన్‌గా నియమించారు. కరీంనగర్ జిల్లా గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా పూడూరి మణెమ్మ, మల్యాల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా చింతంపంటి లక్ష్మి, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అన్నం బ్రహ్మారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ చైర్‌పర్సన్‌గా నర్సింగోజు పద్మ, నల్లగొండ జిల్లా కోదాడ చైర్మన్‌గా కన్నంతరెడ్డి శశిధర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా భూక్యా నాగేశ్వరరావును నియమించారు.