తెలంగాణ

ఓరుగల్లులో ఐదు జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 3: వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్కంఠకు తెరపడింది. జిల్లాల ఏర్పాటు ఫైనల్ ముసాయిదా రాకముందే నరాలు తెగే ఉత్కంఠానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తెరదించారు. సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కొత్త జిల్లాల ఏర్పాటుపై వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ప్రతిపాదన, జనగామ జిల్లా ఏర్పాటుపై ప్రధానంగా చర్చకువచ్చింది. ప్రజల ఆకాంక్ష మేరకు జనగామ జిల్లా ఏర్పాటు చేసేందుకు సిఎం కెసిఆర్ మొగ్గుచూపారు. కొత్తగా ఏర్పాటు కానున్న జనగామ జిల్లాలో జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గాల పరిధిని కలుపనున్నారు. దీంతోపాటు నల్గొండ జిల్లా గుండాల మండలాన్ని కలుపనున్నారు. ఇకపోతే జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, మద్దూరు మండలాలు సిద్దిపేటలో కలువనున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకొని వరంగల్ గ్రేటర్ పరిధిని ఒకే జిల్లాలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలను కలిపి వరంగల్ అర్బన్ జిల్లాగా ఏర్పాటుకానుంది. వీటితోపాటు హసన్‌పర్తి, ఐనవోలు, కరీంనగర్ జిల్లా కు చెందిన భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలు కూడా అర్బన్ జిల్లాలోనే కలుస్తాయి. రూరల్ జిల్లాగా వర్థన్నపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలను కలిపి కలిపి వరంగల్ అజంజాహిమిల్లు కేంద్రంగా వరంగల్ అర్బన్ జిల్లా ఏర్పాటు కాబోతుంది. గతంలో హన్మకొండ జిల్లాలో కలిపే ప్రతిపాదనలో ఉన్న హుజురాబాద్ నియోజకవర్గాన్ని తిరిగి కరీంనగర్‌లోనే కొనసాగించనున్నారు. చారిత్రక ఓరుగల్లు నగరాన్ని విడదీయకుండా వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజవకర్గాలతో కలిసి వరంగల్ అర్బన్‌జిల్లాగా ఏర్పాటు కానుంది. ఇక మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల ఏర్పాటు విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేకపోవడంతో ఓరుగల్లు ఐదు జిల్లాలుగా ఏర్పాటు కావడం ఖాయంగా కన్పిస్తుంది. ఈమేరకు నేటి నుండి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత ఊపందుకోనుంది. కాగా జనగామ జిల్లా ఏర్పాటుకు సిఎం కెసిఆర్ పచ్చజెండా ఊపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అదే విధంగా చారిత్రకనగరాన్ని విడదీయకుండా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ఏర్పాటుపై కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ఏర్పాటుకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనగామలో మిన్నంటిన సంబరాలు