తెలంగాణ

నడిగడ్డ ఆకాంక్ష నెరవేరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 3: నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన గద్వాల జిల్లా సాధన కోసం అనేక రూపాల్లో ప్రభుత్వానికి శాంతియుతంగా ఉద్యమరూపంలో నిరసనలు తెలియజేశామని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజీనామాకు పూనుకున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ స్పష్టం చేశారు. తన రాజీనామాతో నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన గద్వాల జిల్లా కోరిక నెరవేరిందని ఆమె అన్నారు. సోమవారం ఆమె గద్వాలలోని జములమ్మదేవాలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు, పట్టణ ప్రజలు మోటార్ సైకిళ్ల ర్యాలీతో ఊరేగింపు నిర్వహించారు. అంబేద్కర్‌చౌక్ మీదుగా రాజీవ్‌సర్కిల్ నుంచి రాజీవ్‌మార్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డికె.అరుణతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడారు. గత ఏడాదిగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవం కోసం ఎంతో చరిత్ర కలిగిన గద్వాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. చివరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో గద్వాల పేరు లేకపోవడంతో బాధ కలిగించిందన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు అంపయ్య, రామలింగేశ్వర్‌కాంమ్లే, డాక్టర్ మోహన్‌రావు, ఎంపిపి సుభాన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి ఆమరణ దీక్షకు పూనుకున్నప్పటికీ స్పందన కరువైంది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో తన రాజీనామాతో అయనా జిల్లా వస్తుందని భావించి, అందుకు సిద్ధపడినట్లు తెలిపారు. గత రెండు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని, ఉద్యమనేతగా ఇక్కడ జరిగిన ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఏర్పాటుకు సానుకూలం వ్యక్తం చేసినట్లు తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నడిగడ్డ ప్రజల తరపున ఉద్యమ వందనాలు తెలుపుతామన్నారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే డికె అరుణ తన పదవిని ప్రజల ఆకాంక్షముందు చిన్నదిగా భావించి రాజీనామాకు సిద్ధపడి మరోసారి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
సిరిసిల్లా, జనగామ ప్రాంత ప్రజలు కూడ డికె అరుణ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం పట్ల రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నడిగడ్డ ప్రజల ఆకాంక్షను గౌరవించి జోగులాంబతల్లి పేరిట గద్వాల కేంద్రంగా జిల్లా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, రామాంజనేయులు, బంగి సుదర్శన్, ఇంతియాజ్, డిటిడిసి నర్సింహ, మహిళా కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.