తెలంగాణ

అమెరికాలో బతుకమ్మ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: అమెరికాలో భారతీయ మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాలిఫోర్నియా స్టేట్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలోని ప్రీమాంట్ నగరంలో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఈ వేడకుల్లో పాల్గొన్నారు. వేద దేవాలయం పూజారుల మంత్రోచ్ఛరణలతో గౌరీదేవికి ప్రత్యేకంగా పూజ నిర్వహించారు. స్టీవెన్‌సన్ బువార్డ్‌లోని ఆడిటోరియంలో బతుకమ్మలను పేర్చి ఆడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు అమెరికాలోని వివిధ సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రీమాంట్‌లోని రాయల్ ప్యాలెస్‌లో బతుకమ్మ ఆడారు. కవిత బతుకమ్మను ఎత్తుకొని ప్యాలెస్‌కు రాగానే మహిళలు బతుకమ్మతో స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా, తెలంగాణ అమెరికాన్ కల్చరల్ అసోసియేషన్‌లు సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ వెంకటేశన్ అశోక్, ఫ్రీ మాంట్ సిటీ మేయర్ బిల్ హారిసన్, వైస్ మేయర్ సవిత వైద్యనాథన్, తెలంగాణ జాగృతి అమెరికా శాఖ అధ్యక్షుడు శ్రీ్ధర్ బండారు, సతీష్ పసుపులేటి, మురళీ బొమ్మన వేణి, సత్యపాల్ కటకం, రేశ్ చలిమెడ, రాజ్ గౌరీ శంకర్‌లు పాల్గొన్నారు.
నేడు హైటెక్ సిటీలో..
తెలంగాణ జాగృతి ఐటి విభాగం ఆధ్వర్యంలో హైటెక్ సిటీ వద్ద మంగళవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఐటి కారిడార్ సాఫ్ట్ సోల్ బిల్డింగ్ వద్ద సాయంత్రం ఐదున్నర నుంచి బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు ఐటి వింగ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ దాసరి తెలిపారు.

అమెరికాలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్న దృశ్యం