తెలంగాణ

జలాశయంలో జాలర్ల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 3: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట గ్రామంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గల్లంతైన జాలర్లను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. గుడిపేట గ్రామానికి చెందిన జాలర్లు దర్మాదీ రాజేష్, కూనారపు సంతోష్‌తో పాటు మరో పది మంది ఆదివారం ఉదయం 8 గంటలకు చేపల వేటకు వెళ్లారు. కడెం ప్రాజెక్టు నుంచి వరద గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం అధికమవడంతో అధికారులు ఉదయం 11 గంటల సమయంలో 18 గేట్లు ఎత్తారు. దీంతో నీటి ఉధృతిని గమనించిన పది మంది జాలర్లు కరీంనగర్ వైపునకు వెళ్లారు. రాజేష్, సంతోష్ అనే వ్యక్తులు వరద ఉధృతిని గమనించకపోవడంతో జలాశయంలోనే చిక్కుకున్నారు. ఒడ్డున చేరుకున్న పది మంది జాలర్లు అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా వరద నీటిలో చిక్కుకున్న ఆ ఇద్దరిని గుర్తించారు. జలాశయ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని సోమవారం ఉదయం నుంచి రంగంలోకి దింపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం రెండు స్టీమర్ల సహాయంతో జలాశయంలోకి 11 మంది వెళ్లి జాలర్లను 30 గంటల తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చిన సంతోష్, రాజేష్‌లను వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.