తెలంగాణ

ఫలించిన పోరాటం.. సిరిసిల్ల జిల్లా సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 3: గత 50 రోజుల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కరీంనగర్ జిల్లాలో కొత్తగా సిరిసిల్ల జిల్లాను ప్రకటించింది. అలుపెరుగని రీతిలో జిల్లా సాధన ఉద్యమం ప్రారంభం కావడంతో క్రమక్రమంగా పోరాటం తీవ్ర రూపం దాల్చడంతో సిరిసిల్ల జిల్లా అనివార్యంగా మారింది. సిరిసిల్ల డివిజన్ నుండి మండలాలను ఇతర జిల్లాలకు కట్టబెట్టి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆందోళనకారుల ప్రచారం విస్తృతంగా సాగి, ప్రజల్లోకి చేరి చర్చనీయాంశంగా మారడంతో తెలంగాణ ఉద్యమం తరహాలో సబ్బండ బర్గాలన్నీ జిల్లా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ గాజుల బాలయ్య, రిక్కుమల్ల మనోజ్‌కుమార్ ఆమరణ దీక్షను గత ఆగస్టు 15న ప్రారంభించిడంతో న్యాయవాదులు కోర్టు విధులను స్వస్తి చెప్పి ఏకంగా ఉద్యమంలోకి రావడంతో పోరాటానికి ఊపిరి నిచ్చింది. అనంతరం ఒక వైపు న్యాయవాదులు, మరో వైపు పద్మశాలి పరిశ్రమ, వ్యాపార అనుబంధ సంఘాల జెఎసి, అఖిలపక్షం, ప్రజాసంఘాలు, ఉద్యమ పార్టీలు అన్నీ ఒకే వేదికపైకి రావడంతో ఉద్యమం ఉప్పొంగింది. అలాగే తొలుత సిరిసిల్ల జిల్లాకు సుముఖంగా లేని రాజకీయ పార్టీలు సైతం ప్రజల తెలంగాణకు అనుకూలంగా మారి ఉద్యమాలలో పాల్గొన్నాయి.

రోడ్లపై సంబరాలు జరుపుకొంటున్న జెఎసి శ్రేణులు