తెలంగాణ

అకారణంగా చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే డ్రైవర్, గన్‌మెన్‌లపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, అక్టోబర్ 4: అకారణంగా తిట్టారని, విచక్షణారహితంగా కొట్టారని మెదక్ జిల్లా పటన్‌చెరు ఎమ్మెల్యే డ్రైవరు, గన్‌మెన్‌లపై రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కంజర్ల యాదగిరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెట్టీ కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పటన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలోని కానుకుంట గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం నిమిత్తం ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి ఉదయం వెళ్లారు. లింగంపల్లి కూడలి నుంచి కానుకుంట వైపు వెళుతుండగా ట్రాఫిక్ జాం కావడంతో ఎమ్మెల్యే కారు దిగి ముందుకు వెళ్లారు. బైక్‌పై కంజర్ల యాదగిరి అనే వ్యక్తి ఆగిన కారును ఓవర్‌టేక్ చేస్తూ ముందుకు వెళ్లాడు. దీనితో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే డ్రైవరు మహేందర్‌రెడ్డి, గన్‌మెన్‌లు కలిసి కంజర్ల యాదగిరిని తిట్టారు. అకారణంగా చేయ చేసుకున్నారు. దీనితో పోలీసులను ఆశ్రయించిన యాదగిరికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ పోలీసులు తిప్పి పంపినట్లు సమాచారం. దీనితో భూ పర్యావరణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కర్‌రెడ్డిని బాధితుడు ఆశ్రయించాడు. దీంతో అనుచరులతో కలిసి పోలీస్‌స్టేషన్ ముందు భాస్కర్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఎమ్మెల్యే డ్రైవర్, గన్‌మెన్‌లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. రామచంద్రాపురం డిఎస్‌పి, సిఐలు రంగ ప్రవేశం చేసి ఆందోళనకు దిగిన వారిని శాంతపరిచారు. కంజర్ల యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.