తెలంగాణ

‘గద్వాల’ విజయం ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తాను అనుకున్నది సాధించారా? లేక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొన్ని అనుకోని, తప్పనిసరి పరిస్థితుల్లో గద్వాల జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారా? అనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మంగళవారం ఆమె గాంధీభవన్‌కు చేరుకున్నప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలిపారు. నిజానికి ఆమె అనుకున్నది సాధించినట్లేనా? గద్వాలను జిల్లా చేయాలంటూ ఆమె చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేశారు. పైగా గద్వాలను జిల్లా చేసేందుకు తానే అడ్డంకి అని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తే శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానంటూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ కూడా పంపించారు. డికె అరుణ పోరాటం ఫలితంగానే గద్వాల జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్న అభిప్రాయాన్ని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ గద్వాల జిల్లా ఏర్పాటు చేయకపోయినా రాజకీయంగా మరింత పోరాటం చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ఆమెకు అవకాశం ఉండేదని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించడానికి వేరే కారణం కూడా ఉందని ఇతర పార్టీల నాయకులు చెబుతున్నారు. సిరిసిల్ల జిల్లా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నందున, గద్వాల జిల్లా ఏర్పాటుకూ సానుకూలంగా స్పందించారన్న ప్రచారం జరుగుతున్నది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసి గద్వాలకు అంగీకరించకపోతే అరుణ మరింత ఆందోళనకు దిగే అవకాశం ఉంటుందని, గద్వాల ప్రజలు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తారని ముఖ్యమంత్రి భావించి అందుకు అంగీకరించారని చెబుతున్నారు.