తెలంగాణ

రైతులకు గిఫ్ట్ సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: రైతులను భాగస్వామ్యం చేస్తూ రాష్టవ్య్రాప్తంగా గిఫ్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ విధానం దేశవ్యాప్తంగా సత్ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో చాలా నగరాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో నగరం, పట్టణాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను తీసుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయడానికి అభివృద్ధి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ భగవత్ ప్రాంతంలో హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో చేపట్టిన నివాస గృహాలకు భూములు ఇచ్చిన రైతులు క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఈ పద్ధతిని రైతులకు మరింత ఉపయోగపడే విధంగా రూపొందిస్తామన్నారు. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి మూడువేల ఎకరాలకు ఒక టౌన్‌షిప్ చొప్పున నిర్మిస్తామన్నారు. దీనికోసం రైతుల నుంచి భూములు సేకరిస్తామన్నారు. సేకరించిన భూమికి వెలకట్టి దానికి సమానంగా అదే లే అవుట్లలో రైతులకు వాటా కల్పిస్తామన్నారు. దీనివల్ల రైతులకు లాభం కలుగుతుందని, దీనికి సంబంధించిన విధానాన్ని రూపొందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇలా ఉండగా గతంలో సాగు భూములు కోల్పోయిన ఉప్పల్ భగాయత్ భూ బాధితులకు లాండ్ పూలింగ్ పద్ధతిన దసరా కానుకగా ప్లాట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులు కోల్పోయిన భూమికి ఎకరాకు వెయ్యిగజాల చొప్పున హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేసిన వెంచర్‌లో రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాగోల్ వద్ద మూసీకి ఇరువైపుల ఉన్న 754 ఎకరాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో తమ నుంచి తీసుకున్నారని రైతులు వివరించారు. అలాగే సీలింగ్ భూములు తీసుకున్నప్పటికీ దానికి నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు వాపోయారు. అసైన్డ్ భూమి కలిగిన వారికి ఎకరాకు వెయ్యి గజాలు, సీలింగ్ భూమి కోల్పోయిన వారికి ఎకరాకు 600 గజాల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న రైతుల సమస్య పరిష్కారం కావడంతో వారంతా ఆనందంగా దసరా పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మంత్రి కెటిఆర్, ఎంపి మల్లారెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.