తెలంగాణ

తగ్గిన లెక్కతోనే చిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2:పోలింగ్ శాతంపై అన్ని పార్టీల అంచనాలు తప్పాయి. గతంలో కన్నా పోలింగ్ శాతం పెంచేందుకు ఒకవైపు అధికారులు, మరోవైపు మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, సంస్థలు విశేషంగా కృషి చేసినా పోలింగ్ శాతం పెరగలేదు. దీంతో ఫలితాలు ఎలా వస్తాయో అనే కలవరం అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. అయితే టిఆర్‌ఎస్ పార్టీ మాత్రం మొదటి నుంచి అదే ధీమాతో ఉంది. మేం ఆశించిన విధంగానే ఫలితాలు వస్తాయి, మేయర్ స్థానం మాదే అని చెబుతున్నారు. ఓటింగ్ శాతం మేము ఆశించినట్టుగా, ఆంచనా వేసినట్టుగా జరగలేదు, కానీ ఫలితాలు మాత్రం మాకు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. వివిధ సర్వే సంస్థలు, తెలుగులో ప్రముఖ చానల్స్ ఐదు కూడా టిఆర్‌ఎస్‌కు 75 నుంచి 82 వరకు సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పాయని, ఓటింగ్ శాతం పెరిగి ఉంటే మరింత మెజారిటీ పెరిగి ఉండేదని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. 70 సీట్లకు పైగా వస్తాయని టిఆర్‌ఎస్ మొదటి నుంచి అంచనా వేస్తోంది, పోలింగ్ తరువాత కూడా అదే ధీమాతో ఉంది. అయితే పోలింగ్ శాతం తగ్గడం, త్రిముఖ, చతుర్ముఖ పోటీల వల్ల ఏ డివిజన్‌లో ఏమవుతుందో తెలియక అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. 2009 మున్సిపల్ ఎన్నికల్లో 42శాతం పోలింగ్ జరిగింది. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరుగుతుందని అన్ని పార్టీలు ఆశించాయి, పెంచేందుకు అందరూ ప్రయత్నించారు. అయితే ఊహించని విధంగా పోలింగ్ శాతం పెరగలేదు. 2009 గ్రేటర్ ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం ఓటింగ్ పెరిగింది. ఇక 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. సాధారణ ఎన్నికల్లో 53శాతం పోలింగ్ జరిగితే, కేవలం రెండేళ్ల వ్యవధిలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది శాతం పోలింగ్ తగ్గింది. పాతబస్తీలో సైతం బోణి చేయబోతున్నామని ముందు నుంచి చెబుతున్న టిఆర్‌ఎస్ పోలింగ్ తరువాత అదే మాట చెబుతోంది. ఇక కాంగ్రెస్, టిడిపి, బిజెపిల్లో పోలింగ్ తరువాత ఉత్సాహం తగ్గింది. చివరకు పోలింగ్ తీరుపై ఎంఐఎంలో సైతం జోష్ తగ్గింది. దాడులకు దిగడంతో ఎంఐఎంలోని నిస్పృహ బయటపడుతోందని ఇతర పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికల్లో 43 డివిజన్లలో గెలిచిన ఎంఐఎం ఈసారి తన బలాన్ని నిలుపుకోవడంతో పాటు ఎన్నో కొన్ని సీట్లు పెంచుకుంటుందనే అభిప్రాయం బలంగా ఉండేది. కానీ పరిస్థితి చూస్తుంటే ఎంఐఎం తన బలాన్ని కోల్పోతుంది అనే భావన ఏర్పడింది. 43 డివిజన్లలో ఎన్నో కొన్ని కోల్పోవడమే తప్ప పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమాచారం తెలుసుకున్నారు. టిడిపి- బిజెపి కూటమి అనుకున్న విధంగా ఫలితాలు సాధించకపోవచ్చుననే మాట ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే పోలింగ్ శాతం తక్కువగా ఉన్నందున ఫలితం ఎటైనా ఉండవచ్చునని అన్ని పార్టీల నాయకులు ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. మాకు పది సీట్లు వచ్చినా మేం విజయం సాధించినట్టేనని టిడిపి తెలంగాణ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తెలంగాణలో టిడిపిని లేకుండా చేస్తామని అన్నారు, కానీ మేం పది సీట్లు గెలిచాం అంటే మేం ఉన్నట్టే కదా? అని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు. టిడిపికి 23, బిజెపికి 11 సీట్లు వస్తాయని టిడిపి నాయకులు అంచనా వేస్తే, బిజెపి నాయకులు మాత్రం తమకు 19 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక కాంగ్రెస్ నాయకులు 20 చోట్ల గెలుస్తామని, పాత నగరంలో నాలుగు చోట్ల గెలుస్తామని చెబుతున్నారు. ఊహించని ఫలితాలు వస్తాయో, సర్వేలు నిజమవుతాయో లేదో తేలాలంటే ఓట్ల లెక్కింపు కోసం ఈనెల ఐదవ తేదీ వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వేచి చూడాలి.