తెలంగాణ

పరిశుభ్రత పాటించే ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, అక్టోబర్ 4: పరిశుభ్రతను పాటించే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ప్రభు త్వం స్వాస్థ అభియాన్ కింద కాయకల్ప కార్యక్రమం ద్వారా నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్, కాయకల్ప కార్యక్రమ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ ఎ. ప్రభావతి ప్రకటించారు. కోదాడ క మ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం సాయంత్రం సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పారిశుధ్య చర్యలు పాటించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మొదటి బహుమతి కింద లక్ష రూపాయలు, రెం డు, మూడు స్ధానాల్లో నిలిచిన పిహెచ్‌సిలకు 50 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తె లిపారు. ఉత్తమ జిల్లా ఆసుపత్రికి 50 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన జిల్లా ఆసుపత్రికి 25 లక్షలు, ఉత్తమ ప్రాంతీ య ఆసుపత్రికి 20 లక్షలు నగదు ప్రో త్సాహం, అవార్డులను అందచేయనున్నట్లు ఆమె తెలి పారు. నల్లగొండ జిల్లాలోని ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ప్రాం తీయ వైద్యశాల, తొమ్మిది పిహెచ్‌సిలను తాను పరిశీలించాల్సి ఉందని ఆమె అన్నారు. పిహెచ్‌సిల స్థా యిలో తానే అవార్డుకు ఎంపిక చేస్తానని, మిగిలిన ఆసుపత్రులపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానని ఆమె చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రో త్సాహకాలతో ఆసుపత్రులను పరిశుభ్రంగా నిర్వహించాలనేది కార్యక్రమ లక్ష్యమని ప్రభావతి చెప్పారు. కార్యక్రమంలో యునిసెఫ్ స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ ఉమాశంకర్, పిసిపిఎన్‌డి టి న్యాయసలహాదారు డాక్టర్ వాణి, జిల్లా సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ, కోదాడ డిసిఎస్ డాక్టర్ కమల, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం.సుదర్శన్, మధు, సత్యం, యాదగిరి పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్, కాయకల్ప రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ ప్రభావతి