తెలంగాణ

ఆ నాలుగింటికీ గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యులు కె కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన హై పవర్ కమిటీ మంగళవారం సమావేశమైంది. గద్వాల, సిరిసిల్ల, జనగాం, అసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు హైపవర్ కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నాలుగు జిల్లాలపై ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. మండలాలు, మిగిలిన జిల్లా ల ఏర్పాటు కోసం వచ్చిన వినతి పత్రాలను పరిశీలిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు కేశవరావు అధ్యక్షతన హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లాల ఏ ర్పాటు డిమాండ్లను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కేశవరావు నాయకత్వం వహించే కమిటీలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, సభ్యు లు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన నాలుగు జిల్లాల డిమాండ్‌ను పరిశీలించాలని ఈ కమిటీని కెసిఆర్ ఆదేశించారు. సాధ్యాసాధ్యాలను అ ధ్యయనం చేసి ఈ కమిటీ ఈ నెల ఏడవ తేదీన ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అత్యవసర సమావేశాలు నిర్వహించి వేగంగా ప్ర క్రియ పూర్తిచేయాలని ముఖ్యమం త్రి కమిటీని ఆదేశించారు.
కాగా, గద్వాల జిల్లా ఏర్పాటుచేయాలని నిర్ణయించినందుకు కెకె కమిటీకి గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
టిఆర్‌ఎస్‌లో చేరుతున్నందుకే గద్వాలను జిల్లా చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని, తాను పార్టీ మారేది ఉంటే ఆ పని ఎప్పుడో జరిగేదని ఆమె అన్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి కమిటీని కలిసి విజ్ఞప్తి చేశారు. మండలాలకు సంబంధించి పలువురు స్థానిక నాయకులు కమిటీకి వినతిపత్రాలు అందజేశారు. జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ఒక అభిప్రాయానికి రావడంతో స్థానిక నాయకులు మండలాలపై దృష్టి సారించారు.
6వ తేదీ వరకు
వినతిపత్రాల స్వీకరణ
కమిటీకి ఎవరైనా వినతిపత్రాలు అందజేయవచ్చునని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సమావేశం తరువాత మీడియాతో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు కోసం ఎవరైనా వినతి పత్రాలు అందజేయవచ్చునని చెప్పారు. తాము జిల్లాలు పర్యటించమని, ఇక్కడే అధ్యయనం చేస్తామని చెప్పారు. వినతిపత్రాలు ఇవ్వదలుచుకున్నవారు హైదరాబాద్‌లో కమిటీని కలవవచ్చునని హైపవర్ కమిటీ సభ్యులు, మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు వినతిపత్రాలు స్వీకరిస్తామని, 7వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌ను విభజించవద్దు
హైదరాబాద్‌ను అలానే ఉంచాలని విభజించవద్దని హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మహానగరం తెలంగాణకు ముఖచిత్రమని ఆయన తెలిపారు. అంతర్జాతీయ నగరంగా ఉన్న హైదరాబాద్ ప్రాముఖ్యతను నిలబెట్టడానికి హైదరాబాద్‌ను విభజించవద్దని కోరారు.

చిత్రం.. హైదరాబాద్‌లో మంగళవారం హైపవర్ కమిటీ సభ్యుడు కె.కేశవరావును కలిసి ధన్యవాదాలు తెలిపిన గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ