తెలంగాణ

మరో అరసవిల్లి.. వనిపాకల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, అక్టోబర్ 4: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలోని గర్భాలయంలో ఉన్న స్వామివారి ప్రతిమ పాదాలను మంగళవారం సూర్యకిరణాలు తాకాయి. ఆలయంలోని గర్భాలయంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణస్వామి ప్రతిమ స్వామి వారి పాదాలను సూర్య కిరణాలు తాకడంతో భక్తుల ఈ సుందర దృశ్యాన్ని దర్శించి వీక్షించేందుకు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి దేవాలయంలో సూర్యదేవుడి ప్రతిమను తాకే విధంగా వనిపాకలలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి పాదాలను కూడా సూర్యకిరణాలు తాకడం గ్రామస్థులు, భక్తులు, ఆలయ పూజారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది రెండు పర్యాయాలు ఆశ్వయుజమాసం, ఫాల్గుణమాసంలో సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు ఇక్కడి స్వామివారి పాదాలను తాకుతాయ. రోజువారిలా ఆలయంలో పూజలను నిర్వహించేందుకు ఆలయంలోకి ప్రవేశించిన ఆలయ పూజారి దుర్గాప్రసాద్‌శర్మ సూర్యకిరణాలు తాకిన దృశ్యాలను చిత్రీకరించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి పాదాలపై సూర్యకిరణాలు ఏవిధంగా పడతాయో అదేవిధంగా ఇక్కడి వనపాకల ఆలయంలోని లక్ష్మీనారాయణస్వామి పాదాలను సూర్యకిరణాలు తాకడం విశేషం. శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు తాకడాన్ని భక్తులు శుభపరిణామంగా భావిస్తున్నారు. అరసవల్లిలో కనిపించే దృ శ్యాలు మండలంలోని వనిపాకల గ్రామంలో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆలయ పూజారి యెడవల్లి దుర్గాప్రసాద్‌శర్మ తెలిపారు.

చిత్రం.. వనిపాకలలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో
శ్రీలక్ష్మీనారాయణస్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు