తెలంగాణ

దీపావళి ధమాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 4: కోల్‌కతాలో మంగళవారం జరిగిన జాయింట్ బై పార్టెడ్ కమిటీ ఆఫ్ కోల్ ఇండస్ట్రీ (జెబిసిసిఐ) సమావేశంలో బొగ్గు గని కార్మికులకు రూ.54 వేలు దీపావళి బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం జరిగిన సమావేశంలో జాతీయ కార్మిక సంఘాలు రూ.60వేల బోనస్‌ను డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల అనంతరం రూ. 54 వేలకు అంగీకారం కుదిరింది. గత సంవత్సరం రూ.48,500 బోనస్ ఉండగా ఈ సంవత్సరం మరో రూ.5,500 పెరిగి రూ.54వేలకు ఖరారైంది. బోనస్ చట్టం ప్రకారం పారిశ్రామిక రంగంలో పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం (పిఎల్‌ఆర్‌ఎస్) పథకం కింద ఉత్పత్తి, ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకుని పారిశ్రామిక రంగంలో బోనస్ నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు రూ.60వేలు డిమాండ్ చేయగా రూ. 54వేలకు అంగీకారం కుదిరింది.