తెలంగాణ

గ్రేటర్ పీఠం ‘గులాబీ’దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2:గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని, గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ శాతం మరింతగా పెరిగి ఉంటే బాగుండేదని, ఓటింగ్ శాతం పెరిగి ఉంటే మెజారిటీ పెరిగేదని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టిఆర్‌ఎస్ విజయం ఖాయమని చెబుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం కోసం కార్యకర్తలు అభ్యర్థుల గెలుపును తమ భుజాలపై వేసుకున్నారని అన్నారు. విద్యావంతులైన వారు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండడం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా ఓటింగ్‌కు దూరంగా ఉండడం మంచిది కాదని తెలిపారు. ఎంఐఎం- కాంగ్రెస్, ఎంఐఎం-టిఆర్‌ఎస్‌ల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. నిందితులపై పోలీసులు చట్టప్రకారం చర్య తీసుకుంటారని అన్నారు. ఈ గొడవలన్నీ పోలింగ్ బూత్‌ల బయటే జరిగాయని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అన్నారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగాయని, టిఆర్‌ఎస్ వారిపై కూడా కేసులు నమోదయ్యాయని కెటిఆర్ తెలిపారు.
మహమూద్ అలీని పరామర్శించిన కెటిఆర్
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని ఆయన నివాసానికి వెళ్లి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పరామర్శించారు. పాతబస్తీలో ఉన్న మహమూద్ ఇంటిపైనా, ఆయన కుమారుడు ఆజం అలీపైన ఎంఐఎం కార్యకర్తలు దాడిచేశారు. కెటిఆర్‌తో పాటు ఎంపి బాల్కసుమన్ మహమూద్ అలీని పరామర్శించారు.
కెసిఆర్ వల్లే అభివృద్ధి సాధ్యం: డి శ్రీనివాస్
కెసిఆర్ వల్లనే హైదరాబాద్ నగరం అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసించారని, అందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఆదరించారని ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో డి శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని అన్నారు. కెటిఆర్ నాయకత్వంలో గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మంచి ఫలితాలను సాధించనుందని తెలిపారు.
చట్టపరంగా చర్యలు: హోంమంత్రి
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. మహమూద్ అలీ ఇంటిపై దాడి చేసిన వారిపైనా, ఆయన కుమారుడిపై దాడి చేసిన వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుల గురించి పూర్తి సమాచారం ఉందని చెప్పారు.