తెలంగాణ

బకాయిలపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: రైతుల రుణమాఫీ, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల బకాయిలపై పోరాటం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) నిర్ణయించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంపై, తాజాగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించకపోవడంపై క్షేత్ర స్థాయి నుంచి సమగ్ర సమాచారం తెప్పించి ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితుల నుంచి వ్యక్తిగత దరఖాస్తులు సేకరించాలని నిర్ణయించింది. సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు టి. జీవన్‌రెడ్డి, డికె అరుణ, ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి, పార్టీ నాయకులు మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులతో కలిసి మాట్లాడుతూ ఇటీవల వరదలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగినా సరైన అంచనాలు లేకుండా తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి నివేదిక కోరిందని విమర్శించారు. రైతు రుణ మాఫీ పథకం కింద రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని అన్నారు.
రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు ఇంత వరకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అందలేదని, 2015 విద్యా సంవత్సరానికి 25 శాతం నిధులు మాత్రమే విడుదల చేశారని, ఈ ఏడాది ఒక్క పైసా విడుదల చేయలేదని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో పంటల నష్టాలను పరిశీలించేందుకు 4 నుంచి 6వ తేదీ వరకు పార్టీ నాయకులు పంటలను సమగ్రంగా పరిశీలించి నివేదికలు తయారు చేసి తహసిల్దారులకు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని సూచించారు.
19న రాజీవ్ సద్భావన యాత్ర
ఈ నెల 19న చార్మినార్ నుంచి నిర్వహించే రాజీవ్ గాంధీ సద్భావన యాత్రకు హాజరుకావాల్సిందిగా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. 20న పెద్దపల్లిలో రైతు గర్జన నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.