తెలంగాణ

మజ్లిస్ ఒత్తిడితో వికారాబాద్ పేరు మారలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: రాష్ట్ర ప్రభుత్వంపై మజ్లిస్ పార్టీ ఒత్తిడి జిల్లాల ఏర్పాటులోనూ విస్తరించిందని బిజెపి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి విమర్శించారు. మజ్లిస్ ప్రమేయం ఇంతకాలం జిహెచ్‌ఎంసి పరిధికే పరిమితం అనుకున్నామని, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నదని వారు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మజ్లిస్ పార్టీ వత్తిడికి లొంగి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదిత వికారాబాద్ జిల్లాకు అనంతగిరి జిల్లాగా పేరు పెట్టడం లేదని వారు విమర్శించారు. మహబూబాబాద్‌ను మానుకోట జిల్లాగా మార్చాలని, ఆదిలాబాద్‌లోని ఏదైనా ఒక జిల్లాకు స్వాతంత్య్ర సమరయోధుడు కొండా పేరు పెట్టాలని, వరంగల్‌లోని ఒక జిల్లాకు సమ్మక్క- సారక్క జిల్లాగా నామకరణం చేయాలని వారు డిమాండ్ చేశారు.