తెలంగాణ

33 జిల్లాలయితే సౌత్‌లో అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా 33 జిల్లాలను ఏర్పాటు చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. ఒక వేళ 31 జిల్లాలకే పరిమితమైతే రెండవ స్థానంలో ఉంటుంది. తమిళనాడులో 32 జిల్లాలు ఉన్నాయి. కర్నాటకలో 30 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13, కేరళలో 14 జిల్లాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ జిల్లాలు ఉన్న అంటే 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంటుంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా 31 లేదా 33 జిల్లాలైనా తెలంగాణ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 20 జిల్లాలు, హర్యానాలో 22 జిల్లాలు, పంజాబ్‌లో 22 జిల్లాలు, జార్ఖండ్‌లో 24 జిల్లాలు, జమ్ముకాశ్మీర్‌లో 22 జిల్లాలు, చత్తీస్‌గఢ్‌లో 27 జిల్లాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 20, ఉత్తరాఖండ్‌లో 13, హిమాచల్ ప్రదేశ్‌లో 12, త్రిపురలో 8, సిక్కింలో 4, గోవాలో 2 జిల్లాలు ఉన్నాయి.

జిల్లా ప్రారంభించున్న మంత్రి/ఇతరులు
సిద్దిపేట/మెదక్ ముఖ్యమంత్రి, మంత్రి హరీశ్‌రావు,
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
జనగామ మండలి చైర్మన్ స్వామిగౌడ్
భూపాలపల్లి స్పీకర్ మధుసూదనాచారి
జగిత్యాల డిప్యూటీ సిఎం మహమూద్ అలీ
వరంగల్ రూరల్ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి
యాదాద్రి నాయిని నరసింహరెడ్డి
పెద్దపల్లి ఈటెల రాజేందర్
కామారెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
మంచిర్యాల పద్మారావు
వికారాబాద్ మహేందర్‌రెడ్డి
సిరిసిల్ల కె రామారావు
ఆసిఫాబాద్ జోగు రామన్న
సూర్యాపేట జగదీశ్‌రెడ్డి
కొత్తగూడెం తుమ్మల నాగేశ్వర్‌రావు
నిర్మల్ ఇంద్రకరణ్‌రెడ్డి
గద్వాల తలసాని శ్రీనివాస్ యాదవ్
నాగర్‌కర్నూల్ లక్ష్మారెడ్డి
మహబూబాబాద్ చందూలాల్
వనపర్తి జూపల్లి కృష్ణారావు
మల్కాజ్‌గిరి సిఎస్ రాజీవ్ శర్మ