తెలంగాణ

హౌస్‌ఫెడ్ చైర్మన్‌గా నవనీతరావు ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సహకార సంఘాల సమాఖ్య (హౌస్‌ఫెడ్)కు చైర్మన్‌గా కె. నవనీత రావు ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిజిస్ట్రార్ పర్యవేక్షణలో సమాఖ్యకు జరిగిన ఎన్నికల్లో ఏడుగురు పాలక సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో నుంచి టి. నవనీతరావును (హైదరాబాద్) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్-్ఛర్మన్‌గా వసంతరావు దేశ్‌పాండే (హైదరాబాద్), పాలకవర్గ సభ్యులుగా తక్కల్లపల్లి ప్రభాకర్ రావు (వరంగల్), ఎం. గోవర్ధన్ రెడ్డి (కరీంనగర్), ఎ. కిషన్‌రావు (రంగారెడ్డి జిల్లా), బి. సీతారామా రావు (రంగారెడ్డి జిల్లా), జూలూరి కృష్ణ మూర్తి (వరంగల్) ఎన్నికయ్యారు.
నేడు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు!
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 5: వచ్చే 24 గంటల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లా పెగడపల్లిలో 2 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో రెండు సెం.మీ, నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో 2 సెం.మీ, కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఒక సెం.మీ, ఖమ్మం జిల్లా మణుగూరులో ఒక సెం.మీ వర్షపాతం నమోదైంది.