తెలంగాణ

తెలంగాణలో ఐదో విడత మెడికల్ కౌనె్సలింగ్ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఐదో విడత కౌనె్సలింగ్ గురువారం నాడు జరగనుంది. నాలుగో విడతలో ఎంబిబిఎస్, బిడిఎస్ వైద్య కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు బుధవారం సాయంత్రం మూడు గంటల లోపు చేరాల్సి ఉండగా, కొంత మంది రిపోర్టు చేయలేదని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నాలుగో విడతలో ఇంత వరకూ చేరని వారు తమ సీట్లు కోల్పోయినట్టు భావించాలని అన్నారు. మరో విడత కౌనె్సలింగ్ నిర్వహిస్తే వారు ఆ కాలేజీల్లో మరో మారు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అనర్హులని అన్నారు. కాగా ఈ నెల ఆరో తేదీన మిగిలిన సీట్లకు ఐదో విడత కౌనె్సలింగ్ నిర్వహించాలని యూనివర్శిటీ నిర్ణయించింది. గురువారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని యూనివర్శిటీ విసి చెప్పారు. సాయంత్రం వారికి సైతం సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు.