తెలంగాణ

జిల్లాలపై ‘దేశం’ దారులు వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ‘ఎన్టీఆర్ శిష్యుడిగా పేరు తెచ్చుకోవాలన్న కేసీఆర్ ఆలోచన సంతోషమే. ఎన్టీఆర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు’.
‘కేసీఆర్ కలర్లపేరుతో కార్లు మారుస్తూ, ఐపిఎల్ స్కోర్ మాదిరిగా, కార్పొరేట్ ర్యాంకుల మాదిరిగా పిచ్చి తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారు’. ఈ రెండు వేర్వేరు పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలనుకుంటే తప్పులో కాలేసినట్లే. జిల్లాల ఏర్పాటుపై ఒకే పార్టీలో అగ్రనేతలు చేసిన విభిన్న వ్యాఖ్యలివి. నల్లగొండ జిల్లాలో ఉన్న యాదాద్రిని జిల్లాగా ప్రకటించినందుకు తెదేపా జాతీయ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చరిత్ర గలిగిన ఆలేరును రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి కేసీఆర్ తన ఉదారత చాటుకోవాలని సూచించారు. కొమురం భీమ్‌పై ప్రభుత్వం మంచి ఆలోచన చేసిందని ప్రశంసించారు. దసరా నాడు ఎవరినీ బాధ పెట్టనన్న కేసీఆర్, ఆ సంతోషంలో ఆలేరు ప్రజలనూ చేర్చాలన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా పేరు తెచ్చుకోవాలని కేసీఆర్ ఆలోచించడం సంతోషమే. ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ మండలాలు పెట్టారు. ఎన్టీఆర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని మోత్కుపల్లి అభినందించారు.
అయితే, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్శిరెడ్డి మాత్రం జిల్లాల ఏర్పాటుపై అందుకు భిన్నంగా స్పందించి, కేసీఆర్ తీరును తూర్పారపట్టారు. ‘ఇది ప్రజల అవసరాల కోసమా? కేసీఆర్ అదృష్ట సంఖ్య కోసం జిల్లాలు పెడుతున్నారా? దీనికి శాస్ర్తియత లేదు. ఇదంతా రాజకీయావసరాలు, కుట్ర, ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే చేస్తున్నారు. దీన్ని సొంత వ్యవహారంగా మార్చారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలి.
అధికారులను క్షేత్రస్థాయికి పంపకుండా, ప్రతిపక్షాల సలహాలు తీసుకోకుండా మీ కుటుంబం ద్వారానే రాష్ట్రం వచ్చిందన్న భావన కల్పిస్తున్నారు’ అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఒకేపార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే అంశంపై విభిన్నంగా మాట్లాడటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. దీనిపై మోత్కుపల్లి స్పందన కోరగా ‘యాదాద్రి కోసం నేను, మా పార్టీ పోరాటం చేశాం. జిల్లా ఇచ్చి మంచిపనిచేసినందుకు అభినందించా. గతంలో సరైన నిర్ణయాలు తీసుకోనందుకు విమర్శించా కదా? మంచిని మంచి, చెడును చెడుగా చెప్పాలి. కేసీఆర్ ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటాననడం మంచిదే కదా? అలాగే ఆలేరును డివిజన్‌గా చేయమని కోరా. ఇందులో తప్పేముంది? నర్శిరెడ్డి వ్యాఖ్యల గురించి నాకు తెలియదు. నా అభిప్రాయం నేను చెప్పా’నన్నారు.