తెలంగాణ

క్రీడలకు ప్రత్యేక బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, అక్టోబర్ 5: మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర జూనియర్ అంతర్ జిల్లాల 2016 ఫుట్‌బాల్ బాలుర చాంపియషన్‌షిప్ క్రీడలను రాష్ట్ర మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రీడలలో పాల్గొన్న 10 జిల్లాల బాలలు నిర్వహించిన మార్చ్ఫాస్ట్‌ను మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ఇక్కడి స్టేడియం నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వంతో చర్చించి బడ్జెట్‌ను ఇప్పిస్తానని అన్నారు. అతి త్వరలో క్రీడలకు మంచి బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించబోతున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, జిల్లాకు ఒక స్టేడియంను ఆ శాఖ మంత్రి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫుట్‌బాల్ కఠినతరమైన ఆట అయినప్పటికీ ఇక్కడ ఉన్న ఉదయ్, జగన్ ఈ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్టేడియం మరమ్మతులు, నిర్మాణ ఖర్చులకు రూ.1.50 కోట్లు మంజూరైనట్లు ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారని మంత్రి వెల్లడించారు. ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పోటీలకు తరలివచ్చిన 10 జిల్లాల నుండి క్రీడాకారులకు లక్ష రూపాయల విరాళం అందజేస్తానని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలోటిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం ఆఫీసర్ డాక్టర్ మహ్మముద్ అలీ, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ అశోక్, ఎంపిపి లక్ష్మీ కిష్టయ్య, జడ్పీటిసి లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి తలసాని