తెలంగాణ

ఆగని జిల్లాల రగడ.. ‘నారాయణపేట’ కోసం రోడ్డెక్కిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 5: మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త జిల్లాలపై రగడ కొనసాగుతూనే ఉంది. నారాయణపేట జిల్లా ప్రకటించాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఏకంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా కర్ణాటక నుండి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దాంతో ఒక్కసారిగా నారాయణపేటలో 48 గంటల బంద్‌కు జనం శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా బుధవారం సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. నారాయణపేటలో ప్రధాన రోడ్లన్నీ మంటలతో అట్టుడికిపోయాయి. నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయాలంటూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సైతం 48 గంటల బంద్ కొనసాగింది. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గంలో కూడా జిల్లాల రగడతో అట్టుడికిపోయింది. మక్తల్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంచాలని ఒకవేళ ఇతర జిల్లాలో కలపాలను కుంటే నారాయణపేట జిల్లా ఏర్పాటు చేసి అందులో కలపాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ కూడా 48 గంటల బంద్‌తో జనజీవనం స్థంభించింది. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు పక్క రాష్ట్రం కర్ణాటక సరిహద్దు కావడంతో బంద్‌లతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మక్తల్ బంద్ సంధర్భంగా రాయిచూర్, బెంగుళూరు నుండి వచ్చే వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. నారాయణపేట బంద్‌తో కర్ణాటకలోని యాదగిరి, బల్కి, గుల్బర్గ తదితర ప్రాంతాల నుండి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి సరిహద్దులోనే నిలిచిపోయాయి. కాగా, అధికార పార్టీకి చెందిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన ఎత్తుగడలు ఎవరికీ అంతుచిక్కడంలేదు. గద్వాల జిల్లాపై సానుకులంగా ఉన్నామని తెలిపిన మరుక్షణమే నారాయణపేటలో ఆందోళనలు మిన్నంటడం, దాంతో ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం కావడం, ఆయనకు తోడుగా మక్తల్‌కు చెందిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సైతం గద్వాలలో తమ నియోజకవర్గాన్ని కలిపితే రాజీనామా చేస్తానని చెప్పడంతో నారాయణపేట జిల్లాపై అభిప్రాయం మరింత పెరగడానికి తెరాస వేసిన ఎత్తుగడ అని చర్చించుకుంటున్నారు.
అయితే అంతా హైపవర్ కమిటీ ముందు జిల్లాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గద్వాల జిల్లాపై ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్ టిఆర్‌ఎస్ అగ్రనేత కేశవరావును కలిసి గద్వాలపై అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలో మాత్రం ఆందోళనలు మిన్నంటాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మాత్రం కర్ణాకటలోనే ఉంటూ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెరాస వర్గాలు తెలుపుతున్నాయి.