తెలంగాణ

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి)ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ చేపట్టామని సంస్థ చైర్మన్ , కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య పేర్కొన్నారు. ఇందుకోసం తాము అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేశామని అన్నారు. సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా వ్యవస్థకు అవసరమైన మేనేజిమెంట్ నిపుణులను అందించే ధ్యేయంతో ఆస్కి పనిచేస్తోందని, స్వీయ విశే్లషణ, జవాబుదారీతనం, నిజాయితీ, నిబద్ధతతోనే ఉద్యోగులు పనిచేయాలని అప్పుడే ఏ సంస్థ అయినా సత్ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లో ఉద్యోగుల్లో ఐకమత్యమే ఆస్కి బలమని, ఇదే స్ఫూర్తితో సంస్థ ముందుకు సాగాలని పేర్కొన్నారు. అంతకుముందు వేతనాల పెంపుదలతో ఆస్కి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. చైర్మన్ పద్మనాభయ్యకు, డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ పరమితా దాస్ గుప్తలను అభినందించారు. కాగా యురోపియన్ యూనియన్ ఆఫ్ ఇండియా హెడ్ జోహన్ హెస్సే నాయకత్వంలోని ప్రతినిధి బృందం ఆస్కిని సందర్శించి సిబ్బందితో చర్చలు జరిపారు.