తెలంగాణ

నేడు కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: జిల్లాల పునర్ వ్యవస్థీకరణను ఆమోదించడానికి శుక్రవారం మంత్రిమండలి కీలక సమావేశం జరుగనుంది. సచివాలయంలో మధ్యహ్నం రెండు గంటలకు జరుగనున్న మంత్రిమండలి సమావేశంలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై జారీ చేసిన ముసాయిదా మంత్రిమండలి చర్చించనుంది. అలాగే ముసాయిదాపై ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను అనుసరించి జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించనుంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సిద్ధిపేట, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్లకు కూడా మంత్రిమండలి ఆమోదించనుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాదిరిగా బిసిల కోసం ఏర్పాటు చేయబోయే బిసి కమిషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించనుంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు మంత్రిమండలి ఆమోదించిన పిదప ఈ నెల 9 లేక 10వ తేదీలలో తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.
గవర్నర్‌తో సిఎం భేటీ
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలుపడానికి శుక్రవారం సమావేశం కానున్న మంత్రిమండలిలో తీసుకోబోయే నిర్ణయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్‌కు వివరించారు. రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి గవర్నర్‌తో సమావేశమయ్యారు. మంత్రివర్గంలో తీసుకోబోయే ఇతర అంశాలను కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.

చిత్రం.. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్