తెలంగాణ

ఎమ్మెల్యే సున్నం ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 6: ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యం ఉద్యమాలతో వేడెక్కుతోంది. భద్రాచలాన్ని జిల్లా చేయాలని, వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలం నియోజకవర్గంలోనే ఉంచి, ఆంధ్రాలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకులపాడు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, భద్రాచలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ కొమరం ఫణీశ్వరమ్మ గురువారం నుంచి వేరువేరు చోట్ల ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా, కొమరం ఫణీశ్వరమ్మ సినిమాహాల్ సెంటర్లో వేర్వేరుగా దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో ప్రజలను మోసం చేసిందని వారు ఆరోపించారు. ఆదిమ గిరిజన తెగల సమూహ కేంద్రం, రాముడు నడయాడిన ప్రాంతం, శ్రీ రామదివ్యక్షేత్రాన్ని విస్మరించడమేగాక భద్రాచలానికి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతోనే భద్రాచలం ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో పునర్జీవం పోయాల్సిన ప్రభుత్వం పుండుపై కారం చల్లిన చందంగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లి జిల్లాలో కలిపి మూడు ముక్కలు చేయడానికి పూనుకోవడం పాలకుల దాష్టీకానికి నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహం తీవ్ర పరిణామాలకు దారితీయకముందే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలంలో కొనసాగించాలని, ఆంధ్రాలో విలీనమైన 5 పంచాయతీలను తిరిగి తీసుకొచ్చి, భద్రాచలం జిల్లా ప్రకటించి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో తెలంగాణ ప్రభుత్వం తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. భద్రాచలం డివిజన్ సిపిఐ సహాయ కార్యదర్శి రావులపల్లి రవికుమార్ వెంటనే ప్రభుత్వం దిగి రావాలని, లేనిపక్షంలో ఉద్యమం పరాకాష్టకు చేరుతుందని హెచ్చరించారు. మరోవైపు వాజేడు, వెంకటాపురం మండలాలను తిరిగి భద్రాచలం నియోజకవర్గంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వెంకటాపురానికి చెందిన ప్రజాప్రతినిధులంతా పదికార్లలో బయలుదేరి గురువారం హైదరాబాదుకు వెళ్లారు.

చిత్రం.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాన ఎమ్మెల్యే సున్నం రాజయ్య