తెలంగాణ

వంద కిలోల అల్ప్రాజోలం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ కేంద్రంగా మత్తుపదార్థాల దందా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి సరఫరా చేసిన వంద కిలోల అల్ప్రాజోలంను విశాఖపట్నంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని ఓ స్థావరంలో అల్ప్రాజోలం నిల్వలున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు గట్టి నిఘా వేశారు. హైదరాబాద్ నుంచి అల్ప్రాజోలం మత్తుమందును విశాఖపట్నంకు తరలిస్తుండగా పోలీసులు అనుసరించారు. విశాఖపట్నం చేరుకున్న మత్తుమందుతో సహా ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50కిలోల ముడి పదార్థాలతోపాటు వంద కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.5కోట్లు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా మత్తు పదార్థాలను హైదరాబాద్ నుంచి తరలించడమే కాకుండా, ఓ కెమిస్ట్‌ను విశాఖపట్నంకు రప్పించి నిందితులు మత్తుమందు తయారు చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.