తెలంగాణ

తెలంగాణలో బలీయమైన శక్తిగా బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 6: రాష్ట్రంలో బిజెపి బలీయమైన శక్తిగా ఎదుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని అన్నపూర్ణగార్డెన్‌లో గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశాల ప్రారంభోత్సవ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్రంలో బిజెపి బలోపేతం కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నామని తెలిపారు. 2019లో తెలంగాణలో అధికారమే అజెండాగా వ్యూహంతో ముందుకెళ్లే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం బిజెపికి మాత్రమే ఉందని అన్నారు. టిఆర్‌ఎస్‌పై ఈ వేదిక నుండి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చినా కేంద్ర నిధులు దారి మళ్లిస్తూ తమ పథకాలుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేస్తామని ప్రజల్లో అవగాహన చేయనున్నామని తెలిపారు.