తెలంగాణ

నిరసనలు ఉద్ధృతం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆక్టోబర్ 6: జిల్లాల పునర్విభజన తుది ఘట్టానికి చేరుకుంటున్న క్రమంలో ప్రజల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోరుతూ గురువారం మిర్యాలగూడ బంద్ పాటించి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. దామరచర్లలో సైతం మిర్యాలగూడ జిల్లా కోసం రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి జిల్లా పరిధిలోని తమ మండలాన్ని జనగామ జిల్లాలో కలుపవద్ధంటు గుండాల మండల వాసులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేశారు. మండల కేంద్రంలో రాస్తారోకో, వంటావార్పుతో నిరసనకు దిగిన నాయకులను, ప్రజలను పోలీసులు చెదరగొట్టారు. పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట సాగింది. గుండాల ఎంపిపి సంగి వేణుగోపాల్, జడ్పీటిసి మందడి రామకృష్ణారెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చిందం ప్రకాశ్, బిజెవైఎం మండల అధ్యక్షుడు కుమారస్వామి తమ మండలాన్ని యాదాద్రిలో కొనసాగించాలంటూ ఆమరణ దీక్ష చేపట్టారు. అడవిదేవులపల్లిని మండల కేంద్రంగా చేయాలంటూ నిరాహార దీక్షలు చేపట్టగా, దేవతల సైదులు అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. నాంపల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ కోరే సాయిరాం సెల్‌టవరెక్కి హల్‌చల్ చేశాడు.