తెలంగాణ

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, అక్టోబర్ 6: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామశివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో 26 మంది బస్సు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి 36 మంది ప్రయాణికులతో జగ్గారెడ్డిగూడెంకు వెళ్తున్న ఎపి 07 జెడ్0403 నెంబర్ సూపర్ లగ్జరీ బస్సు జాతీయ రహదారిపై ఉన్న హోటల్-9 సమీపంలోకి రాగానే ఆగిపోయంది. దీం తో రోడ్డుకు ఎడమ వైపు ఆపి డ్రైవర్ పరిశీలిస్తుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వెనుకనుండి అతివేగంగా ఢీకొట్టడంతో బస్సు, లారీ రెండూ పల్టీ కొట్టాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి తీవ్రగాయాలు కాగా లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిలో ముత్తవరపు రుక్మిణి (55), ముత్తవరపు వెంకటేశ్వర్లు (40) అక్కడికక్కడే మృతిచెందారు.
ముత్తవరపు నాగలక్ష్మితో పాటు డ్రైవర్, క్లీనర్‌కు కాళ్లు, చేతులు విరిగాయి. మృతులు కృష్ణా జిల్లా ఈర్లపాడు మండలం పొన్నవరం గ్రామస్థులు. క్షతగాత్రులను హుటాహుటిన ఎన్‌హెచ్‌ఏఐ 1033, రెండు 108 అంబులెన్స్‌ల ద్వారా ప్రథమ చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కిష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.